Success Story: సేంద్రియ సాగులో రైతులకు మహిళ సాయం… లక్షల్లో లాభాలు ఆర్జించేలా సహకారం

Success Story: సేంద్రియ సాగులో రైతులకు మహిళ సాయం... లక్షల్లో లాభాలు ఆర్జించేలా సహకారం
Pratibha Tiwari

Success Story: భారతదేశంలో సేంద్రీయ వ్యవసాయం (organic farming) మూలాలు సింధు లోయ నాగరికతలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖచెప్పిన లెక్కల

Surya Kala

|

Jan 17, 2022 | 2:26 PM

Success Story: భారతదేశంలో సేంద్రీయ వ్యవసాయం (organic farming) మూలాలు సింధు లోయ నాగరికతలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖచెప్పిన లెక్కల ప్రకారం.. మార్చి 2020 నాటికి దేశంలోని వ్యవసాయ భూమిలో కేవలం 2.78 మిలియన్ హెక్టార్లు ( హెక్టార్లు) మాత్రమే సేంద్రీయ సాగులో ఉంది. అయితే దేశంలోనే పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం చేస్తోన్న ఏకైక రాష్ట్రంగా సిక్కిం ఖ్యాతి గాంచింది. మధ్యప్రదేశ్ లో 0.76 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ పథకం 16 జిల్లాలలో అమలవుతుంది. మొత్తం 1,800 గ్రామాలలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. దాదాపు 1,200 మంది రైతులను సేంద్రీయ వ్యవసాయం చేసే దిశసగా ప్రోత్సహించిన ఘనత భోపాల్‌కు చెందిన పారిశ్రామికవేత్త , మహిళా రైతు ప్రతిభా తివారీ (41)కి చెందుతుంది.

భూమిషా ఆర్గానిక్స్‌ సంస్థ

భూమిషా ఆర్గానిక్స్‌ను అనే సంస్థను 2016లో ప్రతిభ ప్రారంభించింది. వందలాది మంది రైతులు పండిస్తున్న ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారు. అంతేకాదు ఆ ఉత్పత్తులను ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్‌లుగా ప్రాసెసింగ్ చేసి.. దేశవ్యాప్తంగా 450 మంది వినియోగదారులకు అందజేస్తున్నారు. దీంతో రైతులకు అదనపు ఆదాయాన్ని పొందేలా ప్రతిభ చేశారు.

రైతులకు సరైన గిట్టుబాటు ధర: మాథ్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ప్రతిభ వ్యవసాయం రంగంలో అడుగు పెడతానని అసలు ఊహించలేదని అంటారు. ప్రతిభ పెళ్లయిన తర్వాత తన అత్తమామల ఇంట్లో వ్యవసాయం చేసే విధానాన్ని దగ్గరుండి చూసి ఇన్స్పిరేషన్ పొందారు. అప్పటి నుంచి పంటల మీద ఆసక్తితో వ్యవసాయాన్ని చేసే పద్ధతులపై పరిశోధించడం మొదలు పెట్టారు. రసాయనిక వ్యవసాయంతో భూమి సారం పోవడమే కాదు ఆ ఉత్పత్తులు కూడా హానికరమైనవని గుర్తించారు. దీంతో ఆమె సేంద్రీయ వ్యవసాయాన్ని గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. అంతేకాదు ఇతర రైతులను కూడా సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించే దిశగా ప్రోత్సహించారు.

రైతులు తాము పండించిన పంటలకు మార్కెట్ చేసుకోవడమే అతి పెద్ద సమస్యగా ప్రతిభ గుర్తించారు. సేంద్రియ వ్యవసాయం చేసినా పండించిన పంటకు సరైన ధర లభించడం లేదని.. తానే స్వయంగా రంగంలోకి దిగి “భూమిషా ఆర్గానిక్స్‌” ను పతిభ ప్రారంభించారు. రైతులు తమ పంటలను సరైన ధరకు విక్రయించడానికి ఒక వేదికను సృష్టించడం కోసం ఈ పని చేసినట్లు ది బెటర్ ఇండియాతో చెప్పారు.

ఈ సంస్థలో రైతులు తాము చేసిన ఉత్పత్తులకు మార్కెట్ లభించేలా చర్యలు మొదలు పెట్టారు. మధ్యతరగతి, సామాన్యులకు సేంద్రీయ ఉత్పత్తులు చేరేలా వినియోగదారులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ పండిస్తున్న పంటలకు స్థానికంగానే కాదు.. మధ్యప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలు, రాజస్థాన్, గుజరాత్ , మహారాష్ట్ర నుండి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. దీంతో ఇప్పుడు భూమిషా ఆర్గానిక్స్ రూ. 35 లక్షల వార్షిక టర్నోవర్‌ను సాధించిందని ప్రతిభ తెలిపారు.

అయితే తాను భూమిషా ఆర్గానిక్స్ సంస్థను స్థాపించిన సమయంలో రైతులను సేంద్రియ వ్యవసాయం చేసే దిశగా ఒప్పించడానికి చాలా కష్టపదినట్లు అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. రైతులు పండిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో పగలు మరియు రాత్రి శ్రమించానని ఆమె చెప్పింది. “దాదాపు మూడేళ్లపాటు రైతులతో మమేకమై వారి కోసం హోల్‌సేల్ మార్కెట్‌ను ఏర్పాటు చేశాం. వివిధ కంపెనీలు, ఆర్గానిక్ స్టోర్ యజమానులతో ఒప్పందం కుదుర్చుకుని నేరుగా రైతుల ఉత్పత్తులను వారికి అందించడం ప్రారంభింఛి.. ఇప్పుడు మంచి ఆదాయాన్ని పొందేలా చేశానని సంతోషంగా చెబుతున్నారు ప్రతిభ.

ఎవరికైనా ఒక ఎకరం భూమి ఉంటే, గోధుమలకు బదులుగా గులాబీలు లేదా చామంతి పెంచమని సిఫార్సు చేస్తున్నాను.. గత సంవత్సరం నుంచి మూలికలకు డిమాండ్ బాగా పెరిగింది.. అందుకే చాలా మంది రైతులకు పూల తోటలను పెంచేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు భూమిషా ఆర్గానిక్స్ సంస్థలో ఉన్న రైతులందరి ఆదాయం రెండింతలు పెరిగింది అని సంతోషంగా చెబుతున్నారు ప్రతిభ

Also Read:  ఈ పక్షికి సిగ్గెక్కువ.. నేలపై వాలదు.. లుక్ చూస్తే పావురం..లక్షణాలు మాత్రం చిలకవే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu