AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సూచన.. పౌర్ణమి శ్రీవారి గరుడసేవ రద్దు..

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి జనవరి 17వ తేదీ సోమవారం నిర్వహించే పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం..

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సూచన.. పౌర్ణమి శ్రీవారి గరుడసేవ రద్దు..
Tirumala
Sanjay Kasula
|

Updated on: Jan 17, 2022 | 1:55 PM

Share

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి జనవరి 17వ తేదీ సోమవారం నిర్వహించే పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిపిందే. శ్రీవారి ఆలయంలో ఆధ్యయనోత్సవాలు ఈ నెల26వ తేదీ వరకు జరుగుతున్నందున స్వామివారి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించలని సూచించింది. ఇదిలావుంటే.. తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. నిన్న శ్రీవారిని 35,642మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం 11,178మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు అర్పించుకున్నారు.

శ్రీవారి హుండీకి రూ.2.77కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని తిరుమల అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా వ్యాక్సిన్ లేనిపక్షంలో కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ను తమ వెంట తప్పనిసరిగా తెచ్చుకోవాలని టిటిడి అధికారులు సూచించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని వారు పేర్కొన్నారు.

ఇక రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అన్ని ఆలయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ ఏర్పాటు చేయాలని, మాస్క్ ధరించి, 6 అడుగుల భౌతిక దూరం పాటించేలా చూడాలని సూచించారు. అన్ని సేవా టిక్కెట్లను 50 శాతానికి తగ్గించాలని, వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ పూజా సేవలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.

కోవిడ్ జాగ్రత్తలపై అన్ని ప్రముఖ ప్రదేశాలలో బోర్డులు ఏర్పాటు చేయాలని “నో మాస్క్- నో ఎంట్రీ” అనేది అమలు చేయాలన్నారు. అధికారులు, పూజారులు, సిబ్బంది శానిటైజేషన్ చేసిన తర్వాత మాత్రమే విధుల్లోకి రావాలని సూచించారు. క్షురకులందరికీ ఉచిత హ్యాండ్ గ్లోవ్‌లు, డెటాల్, ఫేస్ షీల్డ్‌లు అందించాలని కమిషనర్ హరి జవహర్ లాల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి: Pandit Birju Maharaj: ఆ సవ్వడి ఇక వినిపించదు.. ప్రముఖ కథక్ నృత్యకారుడు పండిట్ బిర్జు మహారాజ్‌‌కు గుండెపోటు

Glowing Skin : చలికాలంలో మెరిసే చర్మం కోసం.. ఈ వింటర్ సూపర్ ఫుడ్స్.. మీ డైట్‌లో చేర్చుకోండి