C-DAC Recruitment: బీటెక్ చేసిన వారికి సీడ్యాక్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు రేపే చివ‌రి తేదీ..

C-DAC Recruitment: సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (C-DAC) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ‌లో...

C-DAC Recruitment: బీటెక్ చేసిన వారికి సీడ్యాక్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు రేపే చివ‌రి తేదీ..
Follow us

|

Updated on: Jan 17, 2022 | 5:35 PM

C-DAC Recruitment: సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (C-DAC) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ‌లో ప‌లు ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 19 ఖాళీల‌ను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ద‌ర ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు గ‌డువు రేప‌టితో (మంగ‌ళ‌వారం) ముగియ‌నున్న నేప‌థ్యంలో నోటిపికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 19 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో ప్రాజెక్ట్ ఇంజ‌నీర్లు 15 ఖాళీలున్నాయి. బీఎస్‌సీ డెవలపర్‌, క్లౌడ్‌ డెవలపర్‌, ఈ గవర్నెన్స్‌ యాప్‌ డెవలపర్‌, బీఎస్‌సీ విభాగాల్లో ఈ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 35 ఏళ్లు మించ‌కూడదు.

* ప్రాజెక్ట్‌ అసోసియేట్లు (క్లౌడ్‌ సపోర్ట్‌): 04 పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ప్రాజెక్ట్ ఇంజ‌నీర్ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు రూ. 40,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్లకు రూ. 34,000 జీతంగా చెల్లిస్తారు.

* అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ రేప‌టితో (18-01-2022)తో ముగియ‌నుంది.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Garlic: ఈ ఆరోగ్య సమస్యలున్నవారు వెల్లుల్లి అస్సలు తినకూడదు.. తింటే మీ పని అంతే..?

Covid 19 Effect: భక్తులకు అలెర్ట్.. ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో దర్శనానికి వెళ్ళాలంటే.. ఇవి తప్పని సరి..

Immunity Booster Drink: రోగనిరోధక శక్తిని పెంచే ఈ డ్రింక్ ను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి..

ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవే
ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవే
మా పిల్లి తప్పిపోయింది... ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి..?పోస్టర్లు
మా పిల్లి తప్పిపోయింది... ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి..?పోస్టర్లు
కాంగ్రెస్ నుంచి కొనసాగుతున్న వలసల ప్రవాహం
కాంగ్రెస్ నుంచి కొనసాగుతున్న వలసల ప్రవాహం
చెవి నొప్పిని నిర్లక్ష్యం చేస్తే వెలకట్టలేని మూల్యం చెల్లిచాలి..
చెవి నొప్పిని నిర్లక్ష్యం చేస్తే వెలకట్టలేని మూల్యం చెల్లిచాలి..
నవీన్ పొలిశెట్టికి బైక్ యాక్సిడెంట్.. షూటింగ్‏కు బ్రేక్ ?..
నవీన్ పొలిశెట్టికి బైక్ యాక్సిడెంట్.. షూటింగ్‏కు బ్రేక్ ?..
మొసలితో తలపడ్డ తాబేలు.. ! చివరిదాకా పోరాడింది.. కట్‌చేస్తే..
మొసలితో తలపడ్డ తాబేలు.. ! చివరిదాకా పోరాడింది.. కట్‌చేస్తే..
ఓట‌రు గుర్తింపు కార్డుని డౌన్ లోడ్ చేసుకోండిలా ??
ఓట‌రు గుర్తింపు కార్డుని డౌన్ లోడ్ చేసుకోండిలా ??
సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ చూసి ఓటెయ్యాలి: వైఎస్ జగన్
సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ చూసి ఓటెయ్యాలి: వైఎస్ జగన్
వేయించిన శనగల్లో కాస్తింత బెల్లం వేసుకుని తింటే.. జరిగేది ఇదే
వేయించిన శనగల్లో కాస్తింత బెల్లం వేసుకుని తింటే.. జరిగేది ఇదే
మీ గార్డెన్‌లో మొక్కలకు కోకోపీట్‌ వాడుతున్నారా..? ఇంట్లోనే తయారీ
మీ గార్డెన్‌లో మొక్కలకు కోకోపీట్‌ వాడుతున్నారా..? ఇంట్లోనే తయారీ