Immunity Booster Drink: రోగనిరోధక శక్తిని పెంచే ఈ డ్రింక్ ను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి..

Immunity Booster Drink: దేశంలో కోవిడ్-19 ( Corona Virus) పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron)వేగంగా వ్యాపిస్తోంది. కనుక ప్రస్తుత పరిస్తితుల్లో..

Immunity Booster Drink: రోగనిరోధక శక్తిని పెంచే ఈ డ్రింక్ ను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి..
Immunity Booster Drink
Follow us
Surya Kala

|

Updated on: Jan 17, 2022 | 12:35 PM

Immunity Booster Drink: దేశంలో కోవిడ్-19 ( Corona Virus) పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron)వేగంగా వ్యాపిస్తోంది. కనుక ప్రస్తుత పరిస్తితుల్లో ఆరోగ్యం, పరిశుభ్రత, రోగనిరోధక శక్తిపై అదనపు శ్రద్ధ పెట్టాల్సి ఉంది. రోగనిరోధక వ్యవస్థ మీ శరీరాన్ని వ్యాధికారక క్రిములతో పోరాడటానికి సిద్ధం చేస్తుంది. అంతేకాదు వ్యాధి వ్యాప్తిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి నిరంతరం తినే ఆహారం, శారీరక శ్రమ విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఆయుర్వేదంలో చెప్పిన చిట్కాలు. శరీరం ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఈ హెర్బల్ డ్రింక్స్ ను తీసుకోండి.

కావలసిన పదార్ధాలు:

నీరు1 కప్పు అల్లం- ¼ టేబుల్ స్పూన్ ముక్కలు పసుపు- పావు టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్- 1 స్పూన్ తేనె -1 స్పూన్

తయారీ విధానం: ఒక దళసరి గిన్నె తీసుకుని అందులో నీరు, అల్లం , పసుపు వేసి (5-10 నిమిషాలు) మరిగించండి. నీరు బాగా మరిగిన అనంతరం స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని కొద్దిగా చల్లబరచండి. ఒక కప్పులో పానీయాన్ని వడకట్టి, తేనె , ఆపిల్ సైడర్ వెనిగర్ జోడించండి.

ఉపయోగాలు: ఈ పానీయం యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. యాపిల్ సైడర్ వెనిగర్ శరీరంలో చెడు వ్యాధికారక కణాల పెరుగుదలను నిరోధిస్తోంది. రోగనిరోధక శక్తికి అవసరమైన ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెరిగేలా చేస్తోంది. పసుపు, అల్లంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ క్రిమినాశక లక్షణాలు కలిగి ఉన్నాయి. అల్లం తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతుంది.

Also Read:  స్టూడెంట్స్ బీ అలెర్ట్.. డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ అన్ని పరీక్షలు వాయిదా..