Goa Shipyard Recruitment 2022: టెన్త్/ఐటీఐ అర్హతతో గోవా షిప్‌యార్డులో 253 ఉద్యోగాలు.. నెలకు రూ.70 వేల జీతం
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన గోవా షిప్‌యార్డు లిమిటెడ్.. అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టుల (Assistant Superintendent posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..
Goa Shipyard Limited Non Executive Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన గోవా షిప్‌యార్డు లిమిటెడ్.. అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టుల (Assistant Superintendent posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 253
ఖాళీల వివరాలు: అసిస్టెంట్ సూపరింటెండెంట్, వెల్డర్, ఆఫీస్ అసిస్టెంట్, స్ట్రక్చరల్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టెక్నికల్ అసిస్టెంట్, ట్రైనీ వెల్డర్, యార్డ్ అసిస్టెంట్, సివిల్ అసిస్టెంట్, అన్‌స్కిల్డ్ పోస్టులతోసహా ఇతర పోస్టులు ఉన్నాయి.
వయోపరిమితి: ఫిబ్రవరి 28, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 36 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.10,100ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత ట్రేడులు/సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 28, 2022.
హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేదీ: మే 9, 2022.
అడ్రస్: సీజీఎం, హెచ్‌ఆర్ విభాగం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్, గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్, వాస్కోడాగామా, గోవా- 403802.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: