RBI Grade B Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్! ఆర్బీఐలో 303 గ్రేడ్ ‘బి’ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
భారత ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్, రెగ్యులేటరీ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India)కు చెందిన సర్వీసెస్ బోర్డు విభాగం గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టుల (Grade B Officer Posts) భర్తీకి అర్హులైన..
RBI Grade B Officer Recruitment 2022 Notification: భారత ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్, రెగ్యులేటరీ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India)కు చెందిన సర్వీసెస్ బోర్డు విభాగం గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టుల (Grade B Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 303
పోస్టుల వివరాలు:
- గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టులు (జనరల్): 238
- గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టులు (ఎకనామిక్ అండ్ పాలిసీ రీసెర్చ్ విభాగంలోని డీఈపీఆర్): 31
- గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టులు (స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ విభాగం): 25
- అసిస్టెంట్ మేనేజర్ (రాజ్ భాష) పోస్టులు: 6
- అసిస్టెంట్ మేనేజర్ (ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ) పోస్టులు: 3
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.83,254ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే చాలు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: ఫేజ్ 1, ఫేజ్ 2 విధానంలో రాత పరీక్షలు జరుగుతాయి. ఫేజ్ 1లో మొత్తం 200ల మార్కులకుగానూ 2 గంటల్లో ఆబ్జెక్టివ్ టైప్‌లో ప్రశ్నలకు సమాధానాలు రాయవల్సి ఉంటుంది. ఫేజ్ 2లో 3 పేపర్లు ఉంటాయి. ఇవి ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతుల్లో ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2022 (సాయంత్రం 6 గంటలలోపు)
- ఆర్బీఐ గ్రేడ్ బి జనరల్ ఆఫీసర్ ఫేజ్ I పరీక్ష తేదీ: మే 28, 2022.
- ఆర్బీఐ గ్రేడ్ బి జనరల్ ఆఫీసర్ ఫేజ్ II పరీక్ష తేదీ: జూన్ 25, 2022.
- ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ డీఈపీఆర్/డీఎస్‌ఐఎమ్ ఫేజ్ I పరీక్ష తేదీ: జూలై 2, 2022.
- ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ డీఈపీఆర్/డీఎస్‌ఐఎమ్ ఫేజ్ II పరీక్ష తేదీ: ఆగస్టు 6, 2022.
- అసిస్టెంట్ మేనేజర్ పరీక్ష తేదీ: మే 21, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: