CISCE ISC Exam 2022: 12వ తరగతి టర్మ్ 2 బోర్డు పరీక్షల కొత్త తేదీలివే! ఎప్పటినుంచంటే..
ఐఎస్‌సీ (ISC) 2022 టైప్ 3, 4 పరీక్షలకు సంబంధించిన కొత్త (సవరించిన) టైమ్‌టేబుల్‌ను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) విడుదల చేసింది..
CISCE ISC Revised Time Table 2022: ఐఎస్‌సీ (ISC) 2022 టైప్ 3, 4 పరీక్షలకు సంబంధించిన కొత్త (సవరించిన) టైమ్‌టేబుల్‌ను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) విడుదల చేసింది. విద్యర్ధులు అధికారిక సైట్cisce.orgలో రివైజ్డ్ టైమ్ టేబుల్‌ను చెక్ చేసుకోవచ్చు. తాజాగా విడుదల నోటిఫికేషన్ ప్రకారం టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జూన్ 8 వరకు నిర్వహించనున్నట్లు తెల్పింది. ప్రతి పరీక్ష 3 గంటలపాటు జరుగుతుంది. అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అదేవిధంగా పరీక్ష రాసేందుకు టైమ్‌టేబుల్‌లో సూచించిన సమయంతోపాటు అదనంగా క్వశ్చన్ పేపర్ చదవడానికి 10 నిమిషాలు కేటాయించడం జరుగుతుంది. ఇంగ్లీష్ పేపర్ Iతో ప్రారంభమై బిజినెస్ స్టడీస్ పేపర్‌తో పరీక్షలు ముగుస్తాయి.
కాగా కొన్ని రోజుల క్రితం బోర్డు ప్రకటించిన సెమిస్టర్ 2 షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 26 నుంచి జూన్ 13 వరకు పరీక్షలు జరగవల్సి ఉంది. ఐతే జేఈఈ మెయిన్ 2022 సెషన్ 1 పరీక్షల తేదీలపై ఐఎస్‌సీ టర్మ్ 2 పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో గతంలో విడుదల చేసిన టైం టేబుల్‌ను సవరించిన బోర్డు కొత్త తేదీలను తాజాగా విడుదల చేసింది. జేఈఈ మెయిన్ 2022 ఏప్రిల్ పరీక్షల దృష్ట్యా ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని బోర్డు పరీక్షలకు సంబంధించిన టైం టేబుళ్లను మార్చిన విషయం తెలిసిందే. ఇదే బాటలో ఐఎస్‌సీ టర్మ్ 2 పరీక్షల టైం టేబుల్ కూడా మారింది.
Also Read: