EPFO Recruitment: విజిలెన్స్ డైరెక్టరేట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలు.. 56 ఏళ్లలోపు వారంతా అర్హులే..
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) విజిలెన్స్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టరేట్ ఉద్యోగాలకు
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) విజిలెన్స్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టరేట్ ఉద్యోగాలకు ప్రకటన జారీచేసింది. డిప్యూటేషన్ ప్రాతిపదికన సంస్థకు చెందిన వివిధ కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి అర్హులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను మోహిత్ కుమార్ శేఖర్, రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (HRM), భవిష్య నిధి భవన్, 14 భికాజీ కామా ప్లేస్, న్యూఢిల్లీ 110066 చిరునామాకి పంపించాలి. ఎంపికైన అభ్యర్థులు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం, ఢిల్లీలోని నార్త్ జోన్, మైంబైలోని వెస్ట్ జోన్, హైదరాబాద్ లోని సౌత్ జోన్, కోలకతా లోని ఈస్ట్ జోన్ కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
పూర్తి వివరాలు చదవండి..EPFO Notification
ఈఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 24 సెప్టెంబర్ 2022, ఈఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు బాధ్యతాయుతమైన హోదాలో క్రమశిక్షణ విజిలెన్స్ కేసులను డీల్ చేయడంలో 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తుల గడువు తేదీ పూర్తయ్యే నాటికి అభ్యర్థి గరిష్ట వయోపరిమితి 56 ఏళ్లకు మించకూడదు. మరిన్ని వివరాలకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ జారీచేసిన ఉద్యోగ ప్రకటనను చూడవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.