AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIMS Recruitment: హైదరాబాద్‌ నిమ్స్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోవడానికి అర్హులెవరంటే..

NIMS Recruitment: హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NIMS) పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పంజాగుట్టలోని ఈ వైద్య సంస్థలో ఉన్న మెడికల్‌ జెనెటిక్స్‌ ల్యాబ్‌లో కొన్ని పోస్టులను..

NIMS Recruitment: హైదరాబాద్‌ నిమ్స్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోవడానికి అర్హులెవరంటే..
Narender Vaitla
| Edited By: |

Updated on: Aug 17, 2022 | 3:38 PM

Share

NIMS Recruitment: హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NIMS) పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పంజాగుట్టలోని ఈ వైద్య సంస్థలో ఉన్న మెడికల్‌ జెనెటిక్స్‌ ల్యాబ్‌లో కొన్ని పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్ (సైటోజెనెటిక్స్), సాంకేతిక నిపుణుడు (సైటోజెనెటిక్స్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు ఎంఎస్సీ (జెనెటిక్స్, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ), బీఎస్సీ(లైఫ్ సైన్సెస్), ఎంఎల్‌టీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు టెక్నికల్ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, టెక్నీషియన్‌కు 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* సంబంధిత సర్టిఫికేట్‌లతో దరఖాస్తులను ద డీన్‌, నిమ్స్‌, పంజాగుట్ట, హైదరాబాద్‌ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 26-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఇంటర్వ్యూలు ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయాన్ని ఫోన్‌ కాల్‌ ద్వారా అభ్యర్థులు సమాచారం అందిస్తారు.

* టీఏ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 35,000, టెక్నీషియన్‌ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 25,000 అందిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్