BECIL Recruitment 2022: 8వ/10వ తరగతి అర్మతతో బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియాలో 418 ఉద్యోగాలు

భారత ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL).. 418 లోడర్/అన్‌స్కిల్డ్‌, సూపర్‌వైజర్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్/స్కిల్డ్‌ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

BECIL Recruitment 2022: 8వ/10వ తరగతి అర్మతతో బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియాలో 418 ఉద్యోగాలు
Becil
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 16, 2022 | 10:00 PM

BECIL Loader and Supervisor Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL).. 418 లోడర్/అన్‌స్కిల్డ్‌, సూపర్‌వైజర్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్/స్కిల్డ్‌ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి 8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. రాత పరీక్ష, ఇంటరాక్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 19, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతిభ కనబరచిన అభ్యర్ధులకు నెలకు రూ.20,956ల వరకు జీతంతో ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు ఇంఫాల్, త్రివేండ్రం, ఇండోర్, జైపుర్, మంగళూరు, అగర్తల, పోర్ట్‌బ్లెయిర్‌, వైజాగ్, మధురై, రాంచీ, వారణాసి, గోవా, కోయంబత్తూర్, సూరత్, తిరుచ్చి, బాగ్డోగ్రా, పట్నా, పుణె, భువనేశ్వర్‌లలో పనిచేయవల్సి ఉంటుంది.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.