Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ, తెలంగాణ సహా 7 రాష్ట్రాల్లో అత్యధికంగా టెన్త్‌, ఇంటర్‌ ఫెయిల్‌ విద్యార్ధులు.. కేంద్రం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా అస్సాం, కేరళ, మణిపుర్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 7 రాష్ట్రాల్లో గత ఏడాది ఫెయిలైన విద్యార్థులు 66 శాతంగా ఉన్నారని కేంద్రం తెలిపింది. 10, 12 తరగతులకు ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌ కుమార్‌ సిఫార్సు చేశారు..

ఏపీ, తెలంగాణ సహా 7 రాష్ట్రాల్లో అత్యధికంగా టెన్త్‌, ఇంటర్‌ ఫెయిల్‌ విద్యార్ధులు.. కేంద్రం కీలక నిర్ణయం
10th And Inter Common Education Board
Srilakshmi C
|

Updated on: Jun 20, 2025 | 9:30 AM

Share

పరీక్షల్లో విద్యార్థుల ఫెయిల్‌ శాతం అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ తరగతులకు కామన్‌ బోర్డును ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర విద్యా శాఖ సూచించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా అస్సాం, కేరళ, మణిపుర్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 7 రాష్ట్రాల్లో గత ఏడాది ఫెయిలైన విద్యార్థులు 66 శాతంగా ఉన్నారని కేంద్రం తెలిపింది. 10, 12 తరగతులకు ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌ కుమార్‌ సిఫార్సు చేశారు.

కాగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం 66 పాఠశాల పరీక్షా బోర్డులు ఉన్నాయి. వాటిలో జాతీయ స్థాయిలో మూడు, రాష్ట్ర స్థాయిలో 63 (54 రెగ్యులర్, 12 ఓపెన్ బోర్డులు) ఉన్నాయి. టాప్ 33 బోర్డులు 97 శాతం విద్యార్థులను కవర్ చేస్తున్నప్పటికీ, మిగిలిన 33 బోర్డులు కేవలం 3 శాతం మందికి మాత్రమే అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయమని కేంద్రం అభిప్రాయ పడింది. 10, 12 తరగతులకు ఏకీకృత బోర్డు ఏర్పాటుచేయడం వల్ల పాఠశాలల పనితీరు, ఫలితాలు మెరుగుపడతాయి. ప్రామాణీకరణ లేకపోవడం వల్ల విద్యార్థుల పనితీరులో అసమానతలు తలెత్తుతున్నాయని పాఠశాల విద్యా కార్యదర్శి సంజయ్ కుమార్ అన్నారు.

2024లో 22.17 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ఫెయిలయ్యారు. 20.16 లక్షల మంది విద్యార్ధులు 12వ తరగతిలో విఫలమయ్యారు. ఈ గణాంకాలు మునుపటి సంవత్సరాల కంటే మెరుగుదలను ప్రతిబింబిస్తున్నప్పటికీ, ఉన్నత విద్యకు సజావుగా మారడం, డ్రాపౌట్ రేట్లను తగ్గించడంలో ఇవి గణనీయమైన అడ్డంకిగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇక ఓపెన్ స్కూల్ బోర్డులు ఇంకా దారుణ స్థితిలో ఉన్నాయి. 10వ తరగతి విద్యార్థులలో 54 శాతం మంది, 12వ తరగతి విద్యార్థులలో 57 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా అధిక ఫెయిల్యూర్ రేట్లు ఉన్న రాష్ట్రాల్లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) తన పరిధిని విస్తరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రస్తుతం దేశంలో NIOS ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలలో బలమైన విద్యావిధానం ఉంది. ఈ రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్ధుల ఫెయిల్యూర్ రేట్లు అత్యల్పంగా ఉన్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.