AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయ విద్యార్థుల్లో గందరగోళం.. ఉన్నత చదువుల కోసం అమెరికాకు ప్రత్యామ్నాయ దేశం ఏదంటే?

అమెరికాలో విద్యార్థి వీసా నిబంధనలు కఠినతరం కావడంతో భారతీయ విద్యార్థులు ఇతర దేశాలను అన్వేషిస్తున్నారు. జర్మనీ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు ప్రత్యామ్నాయాలుగా ఎంపిక అవుతున్నాయి. స్కాలర్‌షిప్‌లు, ఆర్థిక సహాయం వంటి అంశాలు కూడా ఈ మార్పులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే, అమెరికాలోని సమస్యలు తాత్కాలికమేనని నిపుణులు భావిస్తున్నారు.

భారతీయ విద్యార్థుల్లో గందరగోళం.. ఉన్నత చదువుల కోసం అమెరికాకు ప్రత్యామ్నాయ దేశం ఏదంటే?
Study Abroad
SN Pasha
|

Updated on: Jun 21, 2025 | 8:30 AM

Share

అమెరికా అంటేనే భయపడుతున్నారు విద్యార్థులు. అమెరికాకి ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. ఆ లిస్ట్‌లో ఏఏ దేశాలున్నాయి..? అగ్రదేశంలో ప్రస్తుత పరిస్థితులపై నిపుణులు ఏమంటున్నారు అనే విషయాలు కాస్త వివరంగా విశ్లేషించుకుంటే.. డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా విద్యార్థి వీసాల చుట్టూ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో వేలాదిమంది భారతీయ విద్యార్థుల కల చెదిరిపోతోంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారే కాకుండా ఇప్పటికే అక్కడి యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల ప్రణాళికలను సైతం ట్రంప్‌ నిర్ణయాలు దెబ్బతీస్తున్నాయి. మొత్తంగా అమెరికా వెళ్లాలనుకునే వారికి ప్రస్తుత పరిస్థితులు కఠినంగా మారాయి. దీంతో విద్యార్థులు ఇతర దేశాలవైపు చూస్తున్నారు.

జర్మనీ, రష్యా, హాంకాంగ్‌, యూకే, యూరప్‌, ఆస్ట్రేలియా వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. హాంకాంగ్‌ సహా పలు దేశాల్లో స్కాలర్‌షిప్‌తో పాటు ఆర్థిక సాయం కూడా అందడంతో అమెరికా వెళ్లాలన్న ఆలోచనను విరుచుకుంటున్నారు. అమెరికాలో వీసా ఆంక్షలు రోజురోజుకు కఠినంగా మారుతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఏమీ చేయకుండా ఉండటమే ఉత్తమమని పేరెంట్స్‌ కూడా అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు విద్యార్థుల భద్రత, మనశ్శాంతి ముఖ్యమంటున్నారు. అందుకే మాకొద్దీ అమెరికా అనే పరిస్థితికొచ్చినట్లు పలు సర్వేలు కూడా చెబుతున్నాయి. అయితే అమెరికాలో ఈ సమస్యలు తాత్కాలికమేనని, త్వరలోనే అంతా సర్దుకుంటుందని పలువురు నిపుణులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

మరిన్ని కెరీర్ ఉద్యోగాల వార్తల కోసం క్లిక్ చేయండి