Yoga Career Guide: యోగాని కెరీర్ గా ఎలా ఎంచుకోవాలి? ఎన్ని కోర్సులు ఉన్నాయి? ఎక్కడ చదవాలి? ఉద్యోగ అవకాశాలు, జీతం తెలుసుకోండి
యోగా ధ్యానం, ఆసనాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. యోగా ఇందుకే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు యోగాకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. దీంతో యోగా ఒక వృత్తిగా ప్రపంచ ట్రెండ్‌గా మారింది. మన దేశంలో యోగాని అభ్యసించడానికి మాత్రమే కాదు యోగా టీచర్ గా చేసేందుకు కూడా అనేక యోగా కోర్సులు ఉన్నాయి. వీటిని చేయడం ద్వారా యువత మెరుగైన కెరీర్‌ను ఎంచుకుని సంపాదించుకోవచ్చు. యోగా కోర్సు చదివిన తర్వాత.. ప్రభుత్వ ఉద్యోగాల తలుపులు కూడా తెరుచుకుంటాయి'

ఎవరైనా యోగాని తమ కెరీర్ ఎంచుకోవాలనుకుంటే లేదా యోగా టీచర్‌గా ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే.. ఇప్పుడు మేము ఇస్తున్న సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యోగా కేవలం సాధన లేదా ఆసనాలకే పరిమితం కాదు.. నేడు ఇది భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా ప్రజలను ఆకర్షించే వృత్తిగా మారింది. ఆరోగ్యం, ఫిట్‌నెస్ పై శ్రద్ధ పెడుతున్న నేటి సమయంలో యోగాను మెరుగైన కెరీర్ ఎంపికగా చూస్తున్నారు.
యోగాను ఎందుకు కెరీర్‌గా ఎంచుకోవాలి ?
యోగా అనేది ఆధ్యాత్మిక శాంతిని, వృత్తిపరమైన వృద్ధిని అందించే రంగం. ఎవరైనా యోగా శిక్షకుడు, పరిశోధకుడు, చికిత్సకుడు లేదా కార్పొరేట్ యోగా బోధకుడు కూడా కావచ్చు. ప్రస్తుతం రిసార్ట్‌లు, జిమ్‌లు, పాఠశాలలు, ఆసుపత్రులు, కార్పొరేట్ ఆఫీసులు, టీవీ ఛానెల్‌లలో కూడా యోగా నిపుణులకు డిమాండ్ ఉంది. కోవిడ్ తర్వాత ఆన్‌లైన్ యోగా తరగతులు కూడా విపరీతమైన విజయాన్ని సాధించాయి. ఇంటి నుండే ప్రపంచ క్లయింట్‌లతో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని ఇచ్చాయి.
యోగాని కెరీర్‌గా ఎంచుకోవడానికి ఏ కోర్సులు ఉన్నాయంటే
యోగాలో కెరీర్‌ను ఏర్పరచుకోవడానికి సర్టిఫికేట్ నుంచి డిగ్రీ వరకు కోర్సులు ఉన్నాయి. అభ్యర్థులు ప్రాథమిక శిక్షణ, యోగా పరిజ్ఞానం కోసం 1.5 నెలల సర్టిఫికేట్ కోర్సు చేయవచ్చు. 12వ తరగతి ఉత్తీర్ణత తర్వాత ఈ సర్టిఫికేట్ కోర్స్ చేయవచ్చు. దీని ఫీజు రూ. 1,200 నుంచి రూ. 16,000 వరకు ఉంటుంది. అంతేకాదు యోగి సైన్స్, నేచురోపతి లేదా యోగా థెరపీలో డిప్లొమా కోర్సు చేయవచ్చు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఎవరైనా ఈ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. దీని ఫీజు రూ. 20,000 నుంచి రూ. 59,000 వరకు ఉంటుంది.
- బిఎ (యోగా తత్వశాస్త్రం) బ్యాచిలర్ డిగ్రీ (3 సంవత్సరాలు) -12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు (కనీసం 45% మార్కులతో)
- యోగా సిద్ధాంతం, తత్వశాస్త్రం అధ్యయనం- యోగా థెరపీలో ఎంఏ/ఎంఎస్సీ: పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు (2 సంవత్సరాలు)
- ఆరోగ్య సంరక్షణ, చికిత్సగా యోగా నేర్చుకోవడం- యోగాలో గ్రాడ్యుయేషన్ తప్పనిసరి
- అడ్వాన్స్‌డ్ టీచర్స్ ట్రైనింగ్ కోర్సు (1 నెల)- సర్టిఫికెట్ లేదా డిప్లొమాతో పాటు రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
ఎక్కడ నుంచి యోగా నేర్చుకోవచ్చు అంటే
- డి.వై. పాటిల్ విశ్వవిద్యాలయం, పూణే: అడ్వాన్స్‌డ్ యోగా ప్రాక్టీస్ ఫీజు: రూ. 16,000 , యోగా థెరపీ, ఫీజు: రూ. 12,000.
- లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU): డిప్లొమా ఇన్ యోగా, ఫీజు: రూ. 59,000
- పతంజలి విశ్వవిద్యాలయం, హరిద్వార్: యోగా, నేచురోపతిలో యుజి డిప్లొమా, ఫీజు: 20,000
- కాశీ విద్యాపీఠ్, వారణాసి: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ యోగా, ఫీజు: రూ 22,000
- చండీగఢ్ విశ్వవిద్యాలయం: యోగా విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, ఫీజు: రూ. 40,000
- భారత్ విద్యాపీఠ్, పూణే: డిప్లొమా ఇన్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్స్, ఫీజు: రూ. 25,000
యోగాలో మీకు ఎంత జీతం వస్తుంది?
- సర్టిఫికెట్ కోర్సులు చేసిన వారికి: సంవత్సరానికి రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలు
- డిప్లొమా హోల్డర్: సంవత్సరానికి రూ. 1.5 లక్షల నుంచి రూ. 3.5 లక్షల వరకు
- గ్రాడ్యుయేట్ (యోగాలో బి.ఎ): సంవత్సరానికి రూ. 3.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు
- పోస్ట్ గ్రాడ్యుయేట్ (MA/MSc): సంవత్సరానికి రూ. 4 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు
- యోగా ఫ్రీలాన్సర్: సంవత్సరానికి 6 లక్షల రూపాయల ప్రారంభ ఆదాయం
- యోగా ప్రొఫెషనల్: సంవత్సరానికి రూ. 9 లక్షల నుంచి రూ. 15 లక్షలు
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..