AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balkampet Yellamma Temple: బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ భూరి విరాళం.. ఈ సొమ్ముతో ఏమి చేయనున్నారంటే..

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం బోనాల జాతరకు ముస్తాబవుతుంది. బల్కంపేట ఎల్లమ్మకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ అర్ధాంగి నీతా అంబానీ అపర భక్తురాలన్న సంగతి తెలిసిందే. నగరానికి ఎప్పుడు వచ్చినా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తారు. తాజాగా అమ్మవారి ఆలయానికి భారీ విరాళాన్ని అందజేశారు నీతా అంబానీ. ఈ విరాళం సొమ్ముని ఎలా వినియోగించాలో కూడా ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Balkampet Yellamma Temple: బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ భూరి విరాళం.. ఈ సొమ్ముతో ఏమి చేయనున్నారంటే..
Balkampet Yellamma Temple
Surya Kala
|

Updated on: Jun 20, 2025 | 8:17 AM

Share

పురాణాల ప్రకారం విష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముని తల్లి రేణుకాదేవి.. కలియుగంలో ఎల్లమ్మ తల్లిగా భక్తులతో పూజలను అందుకుంటుంది. పార్వతి దేవి అవతారాల్లో బాలా త్రిపుర సుందరీ దేవి ఒకరు.. బాలా త్రిపురసుందరి దేవిని భక్తులు బాలా, బాలాంబిక, బాలికాంబిక అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ బాలికాంబికనే బల్కమ్మ. ఈ అమ్మ కొలువైన ప్రాంతాన్ని బల్కమ్మ పేటగా పిలుస్తారున్నారు. నీటిమధ్యలో స్వయంభువుగా వెలసిన బల్కమ్మ అమ్మవారిని నిత్యం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. కోరి కొలిస్తే కోర్కెలు తీర్చేదైవంగా సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రేటీలు, రాజకీయ నేతలు సైతం నమ్మిపూజిస్తారు. ఈ అమ్మవారికి భారత దేశ కలియుగ కుబెరుడైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కూడా భక్తురాలు. హైదరాబాద్ నగరానికి ఎప్పుడు నీతా అంబానీ వచ్చినా అమ్మవారిని దర్శించుకుంటారు.

త్వరలో ఆషాడ మాసం రానుంది. భాగ్యనగరం బోనాలు సంబరాలకు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో బల్కంపేట అమ్మవారి ఆలయం కూడా ముస్తాబవుతుంది. అయితే తాజాగా ఎల్లమ్మ పోచమ్మకి నీతా అంబానీ కోటి రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ విరాళం బుధవారం రోజున దేవస్థానం బ్యాంక్ ఖాతాలో జమ అయింది. ఈ విరాళం సొమ్ము మొత్తనాన్ని బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి.. దానిపై వచ్చే వడ్డీతో భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తామన్న ప్రస్తుత ఈఓ మహేందర్‌గౌడ్ చెప్పారు.

అయితే నీతా అంబానీ సమయం, సందర్భం దొరికితే చాలు దేశంలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటూ.. ఆయా ఆలయాల అభివృద్ధికి భూరి విరాళం ఇచ్చే సంగతి తెలిసిందే. అయితే నీతా అంబానీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిపై ప్రత్యేక భక్తిని కలిగి ఉంటారు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా సరే అమ్మవారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా నగరంలో ఉప్పల్ స్టేడియం లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నా సమయంలో నీతా అంబానీ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్తో కలిసి అమ్మవారిని దర్శించుకున్న సమయంలో.. అప్పటి ఆలయ ఈవో.. ఆలయ విశిష్ట గురించి తెలియజేసి.. అభివృద్ధి కోసం నీతా అంబానీని సహకరించాల్సిందిగా కోరారు. అప్పటి ఈవో విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన నీతా ఇప్పుడు కోటి రూపాయలను విరాళంగా అందించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

సందర్శించారు. ఆ సమయంలో వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సందర్భంగా అప్పటి ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) కృష్ణ వారికి ఆలయ ప్రాముఖ్యతను, విశిష్టతను వివరించారు. దేవస్థానం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించాలని ఆయన వారిని కోరారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..