DRDO Recruitment: హైదరాబాద్ డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
DRDO Recruitment 2022: రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఈ సంస్థ హైదరాబాద్ విభాగానికి చెందిన...
DRDO Recruitment 2022: రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఈ సంస్థ హైదరాబాద్ విభాగానికి చెందిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ (DRDL)లో జేఆర్‌ఎఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో మెకానికల్ ఇంజినీరింగ్ (02), ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (02) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీతో పాటు వాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి.
* అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను తొలుత వాలిడ్ గేట్ మెరిట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* వాక్‌ఇన్ ఇంటర్వ్యూను 05-07-2022న నిర్వహించారు.
* డీఎల్‌ఓఎమ్‌ఐ, డీఆర్‌డీఓ టౌన్‌షిప్, కంచన్‌బాగ్, హైదరాబాద్-500058 అడ్రస్‌లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..