AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS TET 2022: తెలంగాణ టెట్‌ అభ్యర్థులకు గమనిక.. పరీక్షకు హాజరయ్యే వారు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి..

TS TET 2022: సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మొదటి అడుగుపడిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను ఆదివారం నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణ కోసం....

TS TET 2022: తెలంగాణ టెట్‌ అభ్యర్థులకు గమనిక.. పరీక్షకు హాజరయ్యే వారు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి..
Narender Vaitla
|

Updated on: Jun 11, 2022 | 10:26 AM

Share

TS TET 2022: సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మొదటి అడుగుపడిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను ఆదివారం నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పేపర్‌-1కు 3,51,468 మంది, పేపర్‌-2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. చాలా కాలం తర్వాత టెట్‌ నోటిఫికేషన్‌ రావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. టెట్‌ పరీక్ష కోసం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంతరం లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.

ఇక టెట్‌ పరీక్ష జరుగుతోన్న రోజునే ఆర్‌ఆర్‌బీ పరీక్ష కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో టెట్‌ను వాయిదా వేయాలంటూ పలువురు రాజకీయ నాయకులతో పాటు అభ్యర్థులు సైతం డిమాండ్‌ చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ముందుగా అనుకున్న విధంగానే టెట్‌ను ఆదివారమే నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రేపు జరిగే పరీక్షకు హాజరవుతోన్న అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలపై ఓ లుక్కేయండి..

  1. టెట్‌ పరీక్ష పేపర్‌-1 (ఎస్‌జీటీ) ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. పేపర్‌-2 (స్కూల్ అసిస్టెంట్‌) మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.
  2. అభ్యర్థులు గంటముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్‌లోకి అనుమతించబోమని అధికారులు ఇప్పటికే తెలిపారు.
  3. ఇవి కూడా చదవండి
  4. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాలులోకి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు, సెల్‌ఫోన్‌లను తీసుకురాకూడదు.
  5. ఓఎంఆర్‌ షీట్‌పై సర్కిల్స్‌ నింపేందుకు బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నును మాత్రమే ఉపయోగించాలి.
  6. ఓఎంఆర్‌ షీట్లను మడవడం కానీ చించడం కానీ చేయకూడదు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్
లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక