DRDO Recruitment: హైదరాబాద్ డీఆర్‌డీఓలో ఉద్యోగాలు… ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
DRDO Recruitment: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. డీఆర్‌డీఓ-డిఫెన్స్ మెటలర్జికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (DMRL) పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది...
DRDO Recruitment: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. డీఆర్‌డీఓ-డిఫెన్స్ మెటలర్జికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (DMRL) పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్): 15, రిసెర్చ్ అసోసియేట్ (మెటలర్జీ/మెటీరియల్ సైన్స్) – 01 పోస్టులు ఉన్నాయి.
* జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. వాలిడ్ నెట్/ గేట్ స్కోర్ ఉండాలి. అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించకూడదు.
* రిసెర్చ్ అసోసియేట్ (మెటలర్జీ/ మెటీరియల్ సైన్స్) పోస్టుకు అప్లై చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత. టీచింగ్/ పరిశోధన అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు తొలుత పూర్తి వివరాలను ఫామ్‌లో ఎంటర్ చేసి తర్వాత దానిని dmrlhrd@gmail.comకు మెయిల్ చేయాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను విద్యార్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 24-07-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..