DMHO Warangal Recruitment 2022: టెన్త్‌ అర్హతతో.. వరంగల్‌ జిల్లా ప్రభుత్వ దవాఖానాల్లో ఉద్యోగాలు.. నెల జీతం రూ.52 వేలు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వరంగల్‌ జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం పరిధిలోని బస్తీ దవాఖానాల్లో (DMHO Warangal).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 9 మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి..

DMHO Warangal Recruitment 2022: టెన్త్‌ అర్హతతో.. వరంగల్‌ జిల్లా ప్రభుత్వ దవాఖానాల్లో ఉద్యోగాలు.. నెల జీతం రూ.52 వేలు..
Telangana
Follow us

|

Updated on: Aug 14, 2022 | 8:24 AM

DMHO Warangal Medical Officer Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వరంగల్‌ జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం పరిధిలోని బస్తీ దవాఖానాల్లో (DMHO Warangal).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 9 మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల (Medical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి పదోతరగతి/ఎంబీబీఎస్‌/జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 24, 2022లోపు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టులో దరఖాస్తులు పంపవచ్చు. రాత పరీక్షలేకుండా నేరుగా విద్యార్హతలు, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుంది. దరఖాస్తు రుసుము రూ.500లు తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. అర్హత సాధించినవారికి నెలకు రూ.10,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.