AIIMS Recruitment: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
AIIMS Recruitment 2021: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఢిల్లీలో ఉన్న క్యాంపస్‌లో ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి..
AIIMS Recruitment 2021: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఢిల్లీలో ఉన్న క్యాంపస్‌లో ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి, అర్హులు ఎవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 254 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, మెడికల్ సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి.
* బయోకెమిస్ట్రీ, అనాటమీ, కార్డియాలజీ, క్లినికల్ సైకాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, న్యూరో రేడియాలజీ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్/ఎండీ/డీఎం /ఎంసీహెచ్/ఎండీఎస్/డీఎన్‌బీ, ఎమ్మెస్సీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వీటితో పాటు సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకొని హార్డ్ కాపీలను ఆఫ్‌లైన్‌లో అందించాలి.
* దరఖాస్తులను ఢిల్లీ ఎయిమ్స్ ఆఫీసుకు పంపించాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 17-11-2021న ప్రారంభమవుతుండగా.. 16-12-2021తో ముగియనుంది.
* హార్డ్ కాపీలను అందించడానికి 31-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Soya Upma Recipe: రెగ్యులర్‌కి భిన్నంగా రుచికరమైన టిఫిన్.. సోయా ఉప్మా రెసిపీ.. ఎలా అంటే..
Manipur Terror Attack: మణిపూర్‌లో ఉగ్రవాదుల దాడి.. కల్నల్ కుటుంబంతో సహా ఐదుగురు దుర్మరణం!
Manipur Terror Attack: మణిపూర్‌లో ఉగ్రవాదుల దాడి.. కల్నల్ కుటుంబంతో సహా ఐదుగురు దుర్మరణం!