CSIR UGC NET 2025 Exam: సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ పరీక్ష కొత్త తేదీ ఇదే.. వెబ్‌సైట్లో సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు
సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించేందుకు జేఆర్‌ఎఫ్‌తోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం యేటా రెండు సార్లు సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి జూన్ సెషన్ 2025 పరీక్ష మరో వారం రోజుల్లో జరగనుంది..

హైదరాబాద్, జులై 20: సీఎస్‌ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) జూన్ సెషన్ 2025 పరీక్ష సమీపిస్తుంది. ఈ క్రమంలో పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను ఎన్‌టీఏ విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి నగరానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఇక పరీక్షకు 4 రోజులు ముందుగా అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం జులై 28న ఒకే రోజుల్లో ఆన్‌లైన్ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు రెండో షిఫ్ట్ పరీక్షలు జరగనున్నాయి.
నిజానికి గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు జులై 26, 27, 28 తేదీల్లో నిర్వహించాల్సింది ఉంది. అయితే ఇదే తేదీల్లో హరియాణా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (HTET) ఉన్నందున మూడు రోజులకు బదులు.. జులై 28వ తేదీన ఒకే రోజులో పరీక్షను నిర్వహించనున్నట్లు ఇటీవల యూజీసీ ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో జులై 28వ తేదీన ఒకే రోజులో దేశ వ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహించనుంది. అంటే జులై 28వ తేదీన కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎర్త్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్.. అన్ని సబ్జెక్టులకు ఒకే రోజున పరీక్ష జరగనుంది.
సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్పుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించేందుకు జేఆర్‌ఎఫ్‌తోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం యేటా రెండు సార్లు సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వచ్చిన ర్యాంకు ద్వారా జేఆర్‌ఎఫ్ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే జేఆర్‌ఎఫ్ అర్హత సాధించినవారు యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికకావచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




