CSIR-UGC NET Result Date: త్వరలోనే సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ ఫలితాలు.. ఎన్టీయే వెల్లడి
జాయింట్ సీఎస్‌ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) జూన్-2024 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఫలితాల ప్రకటనకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ప్రిలిమినరీ కీ వెల్లడించిన ఎన్టీయే.. దీనిపై అభ్యంతరాలు స్వీకరించింది. దేశవ్యాప్తంగా 187 నగరాల్లో 348 కేంద్రాల్లో జులై 25, 26, 27 తేదీల్లో పరీక్షలు నిర్వహించింది. తొలిసారి ఈ పరీక్షలు ఆన్‌లైన్‌లో..
న్యూఢిల్లీ, ఆగస్టు 29: జాయింట్ సీఎస్‌ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) జూన్-2024 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఫలితాల ప్రకటనకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ప్రిలిమినరీ కీ వెల్లడించిన ఎన్టీయే.. దీనిపై అభ్యంతరాలు స్వీకరించింది. దేశవ్యాప్తంగా 187 నగరాల్లో 348 కేంద్రాల్లో జులై 25, 26, 27 తేదీల్లో పరీక్షలు నిర్వహించింది. తొలిసారి ఈ పరీక్షలు ఆన్‌లైన్‌లో సీబీటీ పద్ధతిలో జరిగాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 2,25,335 మంది విద్యార్ధులు ఈ పరీక్ష రాశారు. సైన్స్ కోర్సుల్లో విశ్వవిద్యాలయ స్థాయిలో అధ్యయనాలు ప్రోత్సహించేందుకు నిర్వహించే పరీక్ష- సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపిక కావచ్చు.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2025 పరీక్షకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
దేశంలోని ప్రముఖ ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2025’ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో గేట్ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరగనుంది. ఈసారి పరీక్షల నిర్వహణ బాధ్యత ఐఐటీ రూర్కీ చేపట్టింది. వెబ్‌సైట్‌తో పాటు దరఖాస్తు తేదీలను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 30 సబ్జెక్టుల్లో పరీక్షలు జరుగుతాయి. గేట్ స్కోర్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సైతం పరిగణనలోకి తీసుకుంటారు. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న వారితోపాటు చివరి సంవత్సరం చదువుతున్న డిగ్రీ విద్యార్థులూ (బీఏ, బీకాం, బీఎస్‌సీ) కూడా పోటీపడవచ్చు.
గేట్ స్కోర్ ద్వారా ఎంటెక్‌లో చేరితే నెలకు రూ.12,400ల చొప్పున స్కాలర్‌షిప్ అందజేస్తారు.ఐఐటీలు గేట్ స్కోర్‌తో నేరుగా పీహెచ్‌డీలో కూడా ప్రవేశాలు ఇస్తున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 24 నుంచి ప్రారంభంకాగా.. సెప్టెంబర్ 26 తేదీతో ముగుస్తుంది. ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేదీ అక్టోబర్ 7, 2024. ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యూమానిటీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు.