Cochin Shipyard Recruitment 2022: పదో తరగతి అర్హతతో కొచ్చిన్ షిప్‌యార్డులో 330 ఉద్యోగాలు..పూర్తి వివరాలు ఇవే..
భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొచ్చిన్‌లో గల కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (Cochin Shipyard Limited).. ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్, ఔట్‌ఫిట్ అసిస్టెంట్ (Fabrication Assistant Posts) పోస్టుల..
Cochin Shipyard Limited Fabrication Assistant Recruitment 2022: భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొచ్చిన్‌లో గల కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (Cochin Shipyard Limited).. ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్, ఔట్‌ఫిట్ అసిస్టెంట్ (Fabrication Assistant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 330
పోస్టుల వివరాలు:
- ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్ పోస్టులు: 124
- ఔట్‌ఫిట్ అసిస్టెంట్ పోస్టులు: 206
విభాగాలు: షీట్ మెటల్ వర్కర్లు, వెల్డర్లు, మెకానిక్ డీజిల్, ప్లంబర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్) తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు జులై 15, 2022 నాటికి 30 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్:
- మొదటి ఏడాది నెలకు రూ.23300
- రెండో ఏడాది నెలకు రూ.24000
- మూడో ఏడాది నెలకు రూ.24800 వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి 10వ తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ.300
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 15, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.