CDAC Recruitment: పుణె సీడ్యాక్‌లో టెక్నికల్ ఆఫీసర్ల ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి.
CDAC Recruitment 2021: పుణె సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థలో మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన...
CDAC Recruitment 2021: పుణె సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థలో మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా జాయింట్ డైరెక్టర్, ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. * జాయింట్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ/బీటెక్/ఎంసీఏ/పీజీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత పొందాలి. 11 ఏళ్ల పని అభువం ఉండాలి. * ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు బీఈ/బీటెక్/ఎంసీఏ/పీజీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థులకు కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి. * సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ/బీటెక్/ఎంసీఏ/పీజీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక అభ్యర్థులకు మూడేళ్ల అనుభవం తప్పనిసరి.
ముఖ్యమైన విషయాలు..
* జాయింట్ డైరెక్టర్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.1,23,100 జీతంగా అందిస్తారు. * ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు సెలక్ట్ అయిన వారికి నెలకు రూ.78,800 జీతంగా ఇస్తారు. * సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగం పొందిన వారికి నులకు రూ. 67,700 అందిస్తారు. * టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ. 56,100 జీతంగా పొందొచ్చు. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థుల తుది ఎంపికను ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు. * దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 23-07-2021 నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: JEE Mains 2021: జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయంటే..