Hyderabad Public School : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సంచలన నిర్ణయం..! ఆ స్టూడెంట్స్‌కి 100 శాతం ఫీజు మాఫీ..
Hyderabad Public School : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను
Hyderabad Public School : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను లేదా సంపాదించే వారిని కోల్పోయిన విద్యార్థులకు 100 శాతం ఫీజు మాఫీ చేస్తామని ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని బేగంపేట,రామాంతపూర్ ప్రాంతాల్లో ఉన్న హెచ్‌పీఎస్ స్కూళ్లకు ఈ నియమం వర్తిస్తుందని తెలిపింది. ఇదికాకుండా 2021-2022 విద్యా సంవత్సరానికి గాను ట్యూషన్ ఫీజుపై రూ.10,000 మేర తగ్గిస్తున్నట్లు హెచ్‌పీఎస్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 2020-2021 విద్యా సంవత్సరానికి కూడా తాము విద్యార్థులకు ఫీజులో రాయితీ ఇచ్చామని హెచ్‌పీఎస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సెక్రటరీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కోవిడ్ పరిస్థితుల్లోనూ కొన్ని ప్రైవేట్ స్కూళ్లు,కాలేజీలు విద్యార్థులను ఫీజుల పేరుతో దోపిడీ చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో మానవతా దృక్పథంతో ఆలోచించి విద్యార్థులకు మేలు చేసేలా హెచ్‌పీఎస్ నిర్ణయం తీసుకోవడంపై వారి తల్లిదండ్రుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ప్రతి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫీజు రాయితి ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కొవిడ్ వల్ల తల్లిదండ్రుల ఆదాయం కూడా పడిపోవడంతో పిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. మానవతా ధృక్పథంతో ఆలోచించి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు సరియైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
కాగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 1923లో ఏడో నిజాం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో జాగీర్దార్ కాలేజీగా దీన్ని పిలిచేవారు. కేవలం ఉన్నత వర్గాల వారు మాత్రమే ఇందులో చదువుకునేవారు. 1951లో జాగీర్దార్ కాలేజీ స్థానంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌గా దీనికి నామకరణం చేశారు. తేడాది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఏజేసీ పబ్లిక్ స్కూల్ కూడా 800 మంది విద్యార్థులకు రెండు నెలల ఫీజును యాజమాన్యం మాఫీ చేసింది.