India vs Sri Lanka: జీరో నుంచి మొదలుపెడతా.. ఐపీఎల్ లో ఆడినట్లే.. లంకలోనూ రిపీట్ చేస్తా: టీమిండియా యంగ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్
శ్రీలంక టూర్ లో జీరో నుంచి మొదలుపెడతానని యంగ్ బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ తెలిపాడు. శ్రీలంక టూర్ కి ఎంపికైన ఈ యంగ్ ప్లేయర్.. సత్తా చాటేందుకు ఆరాటపడుతున్నాడు.
India vs Sri Lanka: శ్రీలంక టూర్ లో జీరో నుంచి మొదలుపెడతానని యంగ్ బ్యాట్స్ మెన్ సూర్య కుమార్ యాదవ్ తెలిపాడు. శ్రీలంక టూర్ కి ఎంపికైన ఈ యంగ్ బ్యాట్స్ మెన్.. సత్తా చాటేందుకు ఆరాటపడుతున్నాడు. ఈ టూర్ లో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. క్వారంటైన్ పూర్తి చేసుకున్న టీమిండియా.. ప్రాక్టీస్ మ్యాచ్ లతో బిజీగా మారిపోయారు. తాజాగా సూర్యకుమార్ మీడియాతో మాట్లాడాడు. శ్రీలంక పర్యటనపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ లాంటి భారత్ స్టార్ తో తొలిసారి కలిసి పనిచేస్తున్నానని తెలిపాడు. ఈమేరకు ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించాడు. ‘శ్రీలంకతో ఆడేటప్పుడు ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. ఒత్తిడి లేకుంటే ఉత్సాహం రాదు. శ్రీలంక పర్యటన ఆటగాళ్లకు ఎన్నో సవాళ్లను ఇవ్వనుంది. ఇంగ్లాండ్‌తో ఎంట్రీ ఇచ్చిన సిరీస్‌కూ, ప్రస్తుత శ్రీలంక సిరీస్‌కూ సంబంధం లేదు. శ్రీలంక పర్యటనను జీరో నుంచి మొదలుపెట్టాలని భావిస్తున్నాను. గతంలో ఎలా ఆడానో.. శ్రీలంక సిరీస్ లోనూ అలాగే మందుకుసాగాలనుకుంటున్నా’ అని పేర్కొన్నాడు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో క్రికెట్ సిరీస్ లు నిర్వహించడం గొప్ప విశేషమని, మాలాంటి యంగ్ ప్లేయర్లకు ఇదో మంచి అవకాశమని తెలిపాడు. శ్రీలంక సిరీస్ లో రాణించి, సవాళ్లను అధిగమించేందుకు తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాడు.
ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ టీంలో ఎలా ఆడానో.. ప్రస్తుత శ్రీలంక పర్యటనలోనూ ఆడేదందుకు ప్రయత్నిస్తానని వెల్లడించాడు. హార్దిక్ పాండ్య బౌలింగ్‌పై మాట్లాడుతూ.. బౌలింగ్ చేసేందుకు హార్దిక్ పాండ్య సిద్ధంగా ఉన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో బౌలింగ్ చేశాడు. ఇంగ్లాండ్‌తో టీ20ల్లోనూ బరిలోకి దిగాడని గుర్తుచేశాడు. అలాగే శ్రీలంక పరిస్థితులకు అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక్కడ ఉక్కపోత ఎక్కువని, ముంబయి, చెన్నై లాంటి నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని సూర్య కుమార్ వెల్లడించాడు. తమ జట్టును ద్వితీయశ్రేణి టీంగా మాట్లాడుకోవడాన్ని ఈ యంగ్ ప్లేయర్ ఖండించాడు. మేము ఈ విషయం గురించి ఆలోచించడంలేదని తేల్చిచెప్పాడు. కాగా, శ్రీలంక పర్యటనలో మొదటి వన్డే జులై 13న జరగనుంది. రెండో వన్డే జులై 16న, మూడో వన్డే జులై 1తో వన్డే సిరీస్ ముగుస్తుంది. అనంతరం మూడు టీ20 సిరీస్ లో మొదటి టీ20 జులై 21న, రెండోది 23న, చివరది 25న జరగనుంది. అన్ని మ్యాచ్ లు ప్రేమదాస స్డేడియంలోనే జరగనున్నాయి.
?️ ?️: The side is excited for the Sri Lanka tour with Rahul Dravid heading #TeamIndia‘s coaching staff: @surya_14kumar #SLvIND pic.twitter.com/PyspvNlusL
— BCCI (@BCCI) July 6, 2021
Also Read: