Dhoni: హ్యాపీ బర్త్‌డే ‘మిస్టర్ కూల్’.. కెప్టెన్లకే ‘బాద్‌షా’.. భారత క్రికెట్‌లో ఓ ట్రెండ్ సెట్టర్..

మహేంద్ర సింగ్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరు ఒక సంచలనం. సచిన్ టెండూల్కర్ ఓ తరాన్ని ఇన్‌స్పైర్ చేస్తే.. ధోని మాత్రం చిన్న పిల్లల..

Dhoni: హ్యాపీ బర్త్‌డే 'మిస్టర్ కూల్'.. కెప్టెన్లకే 'బాద్‌షా'.. భారత క్రికెట్‌లో ఓ ట్రెండ్ సెట్టర్..
Dhoni.
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 07, 2021 | 8:06 AM

మహేంద్ర సింగ్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరు ఒక సంచలనం. సచిన్ టెండూల్కర్ ఓ తరాన్ని ఇన్‌స్పైర్ చేస్తే.. ధోని మాత్రం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ మోస్ట్ ఫేవరెట్‌గా మారిపోయాడు. 2004లో భారత్ జట్టులోకి వచ్చిన ఈ ఝార్ఖండ్ డైనమేట్.. సౌరవ్ గంగూలీ తర్వాత సారధ్య బాధ్యతలను తీసుకుని వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ధోని సంచలనం..

మ్యాచ్ పరిస్థితి ఏదైనా కూడా.. ధోని క్రీజ్‌లో ఉన్నాడంటే విజయం భారత్ వైపే ఉంటుందని అభిమానుల నమ్మకం. అంతేకాక మ్యాచ్ ఎంత రసవత్తరంగా ఉన్నా.. వికెట్ల వెనుక కూల్‌గా నిర్ణయాలు తీసుకోవడంలో ధోనిని మించినోడు లేదని చెప్పాలి. అటు డీఆర్ఎస్ సిస్టంకు కూడా సరికొత్త పేరును తీసుకొచ్చింది ధోనినే. కొన్నిసార్లు అంపైర్ల నిర్ణయాలు తప్పు కావచ్చు. కానీ ధోని ఎప్పుడూ పర్ఫెక్ట్. బ్యాటింగ్‌లో తన దూకుడును ప్రదర్శిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

1983 తర్వాత మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలోనే ఇండియాకు వన్డే ప్రపంచకప్ సొంతమైంది. అలాగే 2007లో టీ20 వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ధోని కెప్టెన్సీలోనే భారత్ గెలుచుకుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు వెన్నంటే ఉండి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. ఇలా భారత క్రికెట్‌లో ధోని తనకంటూ ఓ అధ్యాయాన్ని రాసుకున్నాడు. అనూహ్యంగా క్రికెట్ ప్రపంచానికి షాక్ ఇస్తూ ధోని ఆగష్టు 15, 2020న తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.

ఐపీఎల్‌లో ది బెస్ట్ కెప్టెన్ మిస్టర్ కూల్…

ఇది మహి ఒక వైపు అయితే.. ఐపీఎల్ మరోవైపు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైన నాటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు సారధ్యం వహిస్తూ.. ఆ టీమ్‌ను ఐపీఎల్ చరిత్రలోనే ది బెస్ట్ జట్టుగా తీర్చిదిద్దాడు. అందరూ సీనియర్లే ఉంటారని వాదన ఉన్నా.. చెన్నై జట్టు అంటేనే విజయానికి చిరునామా అని ధోని నిరూపించాడు. రెండేళ్ళు నిషేదానికి గురైనా.. ఆ తర్వాత ఏడాది ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుని ‘తలా’కి తిరుగులేదు అని విమర్శకులకు కూడా క్లారిటీ ఇచ్చాడు. చెన్నై అంటే ధోని.. ధోని అంటే చెన్నై అనేలా మాస్ అభిమానులకు మిస్టర్ కూల్ బాగా దగ్గరయ్యాడు.

రిటైర్మెంట్ తర్వాత ధోని మొదటి పుట్టినరోజు ఇదే. 40వ వసంతంలోకి ధోని అడుగుపెట్టగా.. ఫ్యాన్స్ తలా బర్త్‌డే రోజున ట్రెండ్ సెట్ చేసేందుకు భారీగా ప్లానింగ్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడు హ్యాష్‌ట్యాగ్‌లను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించేలా ఈ బర్త్ డే ట్రెండ్ సెట్టర్‌గా నిలవాలని తలా అభిమానులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ధోనికి అటు అభిమానులు, ఇటు క్రీడాకారులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Also Read:

దర్జాగా రోడ్డుపై సింహాల నైట్ వాక్.. దడుసుకున్న స్థానికులు.. వీడియో వైరల్.!

టాయిలెట్ సీట్‌పై కూర్చున్న వ్యక్తి.. అంతలోనే ఊహించని షాక్.. మర్మాంగంపై కరిచిన పైథాన్.!

ఈ ఫోటోలో చిరుత ఉంది.. ఈజీగా గుర్తించవచ్చు.. ఎక్కడుందో కనిపెట్టండి.!