Teamindia Womens: టీమిండియా స్టార్ బౌలర్ బయోపిక్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..! ఈ ఏడాది చివరిలోగా పట్టాలపైకి?

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో బయోపిక్ ల హవా నడుస్తోంది. ప్రముఖంగా క్రీడాకారుల జీవిత చరిత్రలపై వరుసగా సినిమాలు పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే.

Teamindia Womens: టీమిండియా స్టార్ బౌలర్ బయోపిక్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..! ఈ ఏడాది చివరిలోగా పట్టాలపైకి?
Anushka Sharma Shoots With Cricketer Jhulan Goswami
Follow us
Venkata Chari

|

Updated on: Jul 06, 2021 | 9:13 PM

Teamindia Womens: ప్రస్తుతం ఇండియన్ సినిమాలో బయోపిక్ ల హవా నడుస్తోంది. ప్రముఖంగా క్రీడాకారుల జీవిత చరిత్రలపై వరుసగా సినిమాలు పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. వీటిలో టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ ధోనీ పై ‘ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన సంగతి తెలిసిందే. అలాగే సచిన్, సైనా నెహ్వాల్ లాంటి ప్రముఖ క్రీడాకారుల జీవిత చరిత్రలపై సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా టీమిండియా మహిళా జట్టు పేసర్ ఝులన్ గోస్వామి బయోపిక్ తీయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమా త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఝులన్ గోస్వామి పాత్రలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ నటించనున్నట్లు బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతేడాది మొదట్లో అనుష్కశర్మ టీమిండియా జెర్సీలో కనిపించింది. ఇక అప్పటి నుంచి ఝులన్‌ గోస్వామి బయోపిక్‌ అంశంపై రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఝులన్‌తో కలిసి అనుష్క ఉన్న కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. దాంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. కాగా, ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతానికైతే ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. అయితే, బాలీవుడ్‌ హంగామా అనే మ్యాగజీన్‌ ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. 2021 చివరినాటికి ఈ సినిమా పట్టాలెక్కనుందని అందులో పేర్కొంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ నడుస్తుందని వెల్లడించింది.

కాగా, 38 ఏళ్ల ఝలన్ గోస్వామి.. పశ్చిమ బెంగాల్‌ నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2002లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భారత్‌ తరఫున 3 ఫార్మాట్లలో 330కి పైగా వికెట్లు సాధించింది. 20ఏళ్లుగా మహిళల క్రికెట్‌లో రాణిస్తుంది. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో గోస్వామి సభ్యురాలిగా ఉంది. త్వరలోనే భారత్, ఇంగ్లండ్ మహిళల మధ్య టీ20 సిరీస్ మొదలు కానుంది. భారత్, ఇంగ్లండ్ టీం ల మధ్య జరిగిన ఏకైక టెస్టు డ్రాగా ముగిసింది. అలాగే మూడు వన్డేల సిరీస్ ను 1-2 తేడాతో భారత మహిళలు కోల్పోయారు. ఈ నెల 9 నుంచి ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

Also Read:

India vs Sri Lanka: ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో సత్తా చాటిన భువనేశ్వర్ టీం..!

ICC Rankings: ఐసీసీ ర్యాకింగ్స్ లో సత్తా చాటిన టీమిండియా ఉమెన్స్ కెప్టెన్ మిథాలీ రాజ్, యంగ్ బ్యాటర్ షెఫాలీ వర్మ..!