ICC Rankings: ఐసీసీ ర్యాకింగ్స్ లో సత్తా చాటిన టీమిండియా ఉమెన్స్ కెప్టెన్ మిథాలీ రాజ్, యంగ్ బ్యాటర్ షెఫాలీ వర్మ..!

టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన వన్డే ర్యాకింగ్స్ లో తొలి స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో అద్భుత ప్రతిభ కనబరిచి అగ్రస్థానాన్ని చేరుకుంది.

ICC Rankings: ఐసీసీ ర్యాకింగ్స్ లో సత్తా చాటిన టీమిండియా ఉమెన్స్ కెప్టెన్ మిథాలీ రాజ్, యంగ్ బ్యాటర్ షెఫాలీ వర్మ..!
Mithali Raj And Shafali Verma
Follow us
Venkata Chari

|

Updated on: Jul 06, 2021 | 8:04 PM

ICC Womens Rankings: టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన వన్డే ర్యాకింగ్స్ లో తొలి స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో అద్భుత ప్రతిభ కనబరిచి అగ్రస్థానాన్ని చేరుకుంది. దాదాపు 16 సంవత్సరాల తరువాత టీమిండియా ఉమెన్స్ కెప్టెన్ మిథాలీ రాజ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. నేడు విడుదల చేసిన వన్డే ర్యాకింగ్స్ లో మిథాలీ రాజ్ తో పాటు యూవ ఓపెనర్ షెఫాలీ వర్మ కూడా మెరుగైన స్థానం సంపాదించింది. మిథాలీ రాజ్ తన 22 ఏళ్ల కెరీర్​లో 8వ సారి అగ్ర స్థానాన్ని సాధించడం విశేషం. మరో టీమిండియా బ్యాటర్​స్మృతి మంధాన 701 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది. భారత్ కెప్టెన్ 762 పాయింట్లతో నాలుగు స్థానాలు ఎగబాకి అగ్రస్థానంలో నిలిచింది.

దక్షిణాఫ్రికా బ్యాటర్ లిజెల్లె లీ 758 పాయింట్లతో రెండవ స్థానం, ఆస్ట్రేలియా బ్యాటర్ హెయిలీ 756 పాయింట్లతో మూడవ స్థానం, ఇంగ్లండ్ బ్యాటర్ బీయ్ మౌంట్ 754 పాయింట్లతో నాలుగవ స్థానం, వెస్టిండీస్ బ్యాటర్ టైలర్ 746 పాయింట్లతో ఐదవ స్థానంలో నిలిచింది. ఇక బౌలింగ్ లో ర్యాకింగ్స్ ను పరిశీలిస్తే.. టీమిండియా నుంచి జూలన్​ గోస్వామి 694 పాయింట్లతో 4వ స్థానం, పూనమ్​ యాదవ్​617 పాయింట్లతో 9 స్థానం పొందారు. ఆస్ట్రేలియా బౌలర్లు జెస్​ జొనాస్సెన్​ 808 పాయింట్లతో తొలి స్థానం పొందగా, మేఘన్​ షట్​762 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే ఆల్​రౌండర్ల విభాగంలో టీమిండియా నుంచి క్రికెటర్​ దీప్తి శర్మ 331 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో సౌతాఫ్రికా క్రికెటర్ మరిజన్నె కప్ నిలవగా, ఆస్ట్రేలియా క్రికెటర్ ఎల్లిసా పెర్రి రెండవ స్థానంలో నిలిచింది.

ఇక టీ20 ర్యాంకింగ్స్​ను పరిశీలిస్తే.. బ్యాటింగ్ లో టాప్​టెన్ లో ఇద్దరు టీమిండియా మహిళా క్రికెటర్లు చోటు సంపాదించారు. షెఫాలీ వర్మ 776 పాయింట్లతో అగ్రస్థానం పొందగా, స్మృతి మంధాన 693 పాయంట్లతో 4వ స్థానంలో నిలిచింది. ఇక బౌలింగ్ లో దీప్తి శర్మ 705 పాయింట్లతో 5వ స్థానం, రాధా యాదవ్​ 702 పాయింట్లతో 6వ స్థానం పొందింది. ఆల్​రౌండర్​ విభాగంలో దీప్తి శర్మ 304 పాయింట్లతో 5వ ర్యాంకులో నిలిచింది.

Also Read:

Ind Vs Eng: టీమిండియాతో సిరీస్‌.. ఇంగ్లాండ్‌ జట్టుకు ఊహించని షాక్.. ముగ్గురు క్రికెటర్లకు కరోనా!

World Sailing Championships 2021: ఇటలీ పోటీలకు హైదరాబాద్‌ బాలుడు.. అంతర్జాతీయ ఘనత సాధించిన 15 ఏళ్ల నావికుడు!

Tokyo Olympics 2020: దేశ ప్రజలంతా మీ వెంటే.. మమ్మల్ని గర్వపడేలా చేయండి..! అథ్లెట్లలో స్ఫూర్తినింపిన మాస్టర్ బ్లాస్టర్

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?