India vs Sri Lanka: ప్రాక్టీస్ మ్యాచ్‌లో సత్తా చాటిన భువనేశ్వర్ టీం..!
కెప్టెన్ శిఖర్ ధవన్ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ టూర్ లో మూడు వన్డేలలోపాటు మూడు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే. శ్రీలంక చేరుకున్న బారత జట్టు.. క్వారంటైన్ పూర్తి చేసుకుంది.
IND Vs SL: కెప్టెన్ శిఖర్ ధవన్ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ టూర్ లో మూడు వన్డేలలోపాటు మూడు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే. శ్రీలంక చేరుకున్న బారత జట్టు.. క్వారంటైన్ పూర్తి చేసుకుంది. దాంతో కోచ్ ద్రవిడ్ పర్యవేక్షణలో టీమిండియా ఆటగాళ్లు.. రెండు టీంలు గా విడిపోయి సన్నాహక మ్యాచ్ లు ఆడారు. కెప్టెన్ ధవన్, వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ లు రెండు టీంలుగా విడిపోయి బరిలోకి దిగారు. తొలుత బ్యాటింగ్ చేసిన ధవన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే 45 బంతుల్లో 63 పరుగుతలతో రాణించగా, రుతురాజ్ గైక్వాడ్, ధవన్ ఆకట్టుకున్నారు. బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భువీ టీం.. సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా, పడిక్కల్‌లు అద్భుతంగా ఆడడంతో 17 ఓవర్లలోనే టార్గెట్ చేరుకుంది. శ్రీలంక జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ లో తలపడనుంది. ఇందు కోసం 20 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక పంపించారు. వీరిలో ఐదుగురు నెట్ బౌలర్లు కూడా ఉన్నారు. భారత రెగ్యులర్ జట్టు కోహ్లీ సారథ్యంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఈమేరకు శ్రీలంక, భారత్ ల మధ్య తొలి వన్డే జులై 13న జరుగనుంది.
భారత జట్టు: శిఖర్ ధవన్(కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుత్‌రాజ్ గైక్వాడ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్(వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), యజువేంద్ర చాహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతం, కృనాల్ పాండ్యా, దీపక్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా
The recap with a twist ?
Paras Mhambrey takes the 9⃣0⃣-seconds match-rewind ⏪ challenge ? ?
Watch NOW ⌛️ ?#TeamIndia #SLvIND pic.twitter.com/UTpRH0V9ug
— BCCI (@BCCI) July 5, 2021
High Energy ⚡️ Full? Intensity ?
A productive day in the field for #TeamIndia during their T20 intra squad game in Colombo ? ?#SLvIND pic.twitter.com/YLbUYyTAkf
— BCCI (@BCCI) July 5, 2021
Also Read:
Ind Vs Eng: టీమిండియాతో సిరీస్.. ఇంగ్లాండ్ జట్టుకు ఊహించని షాక్.. ముగ్గురు క్రికెటర్లకు కరోనా!