CM JAGAN: వైఎస్ జగన్ రెండ్రోజుల పాటు జిల్లాల పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

ఏపీ సీఎం జగన్ రెండ్రోజుల టూర్‌కి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దివంగతనేత వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులర్పిస్తారు. అటుపై కడప, అనంతపురం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు సీఎం జగన్.

CM JAGAN: వైఎస్ జగన్ రెండ్రోజుల పాటు జిల్లాల పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
Ap Cm Jagan
Follow us

|

Updated on: Jul 06, 2021 | 10:29 PM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండ్రోజుల పాటు కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని 74 ఉదేగోళం గ్రామానికి చేరుకుంటారు సీఎం జగన్. రైతు దినోత్సవం సందర్భంగా అక్కడ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అటుపై కస్టమ్ హైరింగ్ సెంటర్స్‌ని పరిశీలిస్తారు. అనంతరం YSR ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ప్రారంభించి,,,లబ్ధిదారులోత మాట్లాడుతారు. ఈకార్యక్రమం ముగియగానే మెగా చెక్కుల పంపిణిలో పాల్గొంటారు. అక్కడే రైతు దినోత్సవం సందర్భంగా రైతులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.

అక్కడి నుంచి కడప జిల్లాకు చేరుకుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పులివెందులలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఈనెల 8న YSRజయంతి సందర్భంగా YSR ఘాట్ దగ్గర రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పిస్తారు సీఎం జగన్. రాత్రికి ఇడుపులపాయలోనే బస చేస్తారు. శుక్రవారం సైతం కడప జిల్లాలో పర్యటిస్తారు సీఎం జగన్. ముందుగా బద్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతారు. అక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తారు. అది ముగియగానే ఎర్రముక్కపల్లిలోని సిపి బ్రౌన్ రీసెర్చ్ సెంటర్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు జగన్. చివరిగా కడప నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.

ఏపీ సీఎం ఈనెల 8న కడప జిల్లా ఈ నెల 8 వ తేదీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయకు సీఎం వైఎస్ జగన్ రానున్న నేపథ్యంలో ఇడుపులపాయలోని హెలిప్యాడ్,సీఎం బస చేసే అతిధి గృహం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లును పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్,ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.

ఇవి కూడా చదవండి : Breaking: విశాఖలో విషాదం.. కుప్పకూలిన ఫ్లైఓవర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు..

Auto-Rickshaw Race: చెన్నై రోడ్లపై ఆటో రేస్.. హడలిపోయిన ప్రయాణికులు.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్..