YSR Awards: YSR జయంతి పురస్కారాలు.. జీవిత సాఫల్య, సాఫల్య అవార్డుల ప్రకటించనున్న సీఎం జగన్
వంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను ఇవ్వనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వ్యవసాయం, కళలు,...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను ఇవ్వనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు అవార్డు ఇస్తారు. మరి ఈ అవార్డులు వరించేది ఎవరిని? బుధవారం అవార్డులు ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర కమ్యూనికేషన్ల సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ ప్రకటించనున్నారు.
వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు అవార్డుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్ తో పాటు అసామాన్య ప్రతిభ కనబర్చిన సామాన్యులకు కూడా ప్రభుత్వం పురస్కారాలు అందజేయనుంది. YSR లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద 10 లక్షల నగదు, YSR కాంస్య ప్రతిమ, మెడల్ బహుకరిస్తారు. YSR ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద 5 లక్షల నగదు, YSR కాంస్య ప్రతిమ, మెడల్ బహుకరిస్తారు.
వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు అవార్డులు ప్రకటిస్తారు. విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్‌కు, అసామాన్య ప్రతిభ కనబర్చిన సామాన్యులకూ పురస్కారాలు ఇస్తారు.