AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Justice J Eswara Prasad: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వర ప్రసాద్ కన్నుమూత.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..

జస్టిస్ ఈశ్వర ప్రసాద్ కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. బుధవారం రోజు మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు ఉంటాయని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. 

Justice J Eswara Prasad: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వర ప్రసాద్  కన్నుమూత.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..
Justice J Eswara Prasad No
Sanjay Kasula
|

Updated on: Jul 06, 2021 | 10:28 PM

Share

ప్రముఖ మాజీ జడ్జి జస్టిస్‌ ఈశ్వర్‌ ప్రసాద్‌ కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. బుధవారం రోజు మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు ఉంటాయని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి పలువురు నేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. వృత్తిలో ఉన్న సమయంలో పలు కీలక కేసుల్లో తీర్పులు చెప్పిన ఈశ్వర్‌ ప్రసాద్‌.. కీలక ట్రిబ్యూనల్స్‌కి ఛైర్మన్‌గా పని చేశారు. నిరుపయోగంగా ఉన్న పలు చట్టాలను రద్దు చేశారు. న్యాయ శాఖలో తీసుకొచ్చిన చట్టాలకు సూచనలు సలహాలు అందించారు. ఈశ్వర్‌ ప్రసాద్‌ చేపట్టిన మార్గదర్శకాలను మాజీ పీఎం అటల్‌ బిహారీ వాజ్‌పెయి, మాజీ డిప్యూటీ పీఎం ఎల్‌కే అద్వానీల మెప్పు పొందారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈశ్వర్‌ ప్రసాద్‌ అందించిన న్యాయ సేవలను అభినందించారు.

వేల కోట్ల రూపాయల ఆస్తుల కేసుల్లో తీర్పులు ఇచ్చారు. ముఖ్యంగా కీలక స్మగ్లర్లు, డ్రగ్‌ పెడ్లర్స్‌, భారీ మోసాలకు సంబంధించన కేసుల్లో తీర్పులు చెప్పారు. పలు చారిటబుల్‌ ట్రస్టులకు దగ్గరగా పని చేసిన ఆయన.. మతసంబంధమైన సంస్థలకు కూడా టచ్‌లో ఉండేవారు. మొత్తానికి దైవభక్తితో పాటు.. వెల్ఫేర్‌ సంబంధింత కార్యక్రమాల్లో చరుకుగా పాల్గొనే వారు. సత్యసాయి సేవా సంస్థకు కార్యదర్శిగా కూడా పని చేశారు. మెడికేర్‌, విద్యను ప్రోత్సహించే కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి, మావనవాభివృద్దికి దోహదపడే పనులకు తోడ్పాటు అందించేవారు.

1934లో పుట్టిన ఈశ్వర్‌ ప్రసాద్‌ తండ్రి జాస్తి సాంబశివరావు కూడా డిస్ర్టిక్ట్‌ జడ్జి, సెషన్‌ జడ్జిగా పని చేశారు. తల్లి సీతామహలక్ష్మి సైతం లాయర్‌గానే పని చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ చేసిన ప్రసాద్‌.. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. లాయర్‌గా 1959లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఎన్‌రోల్‌ చేసుకున్నారు. 31 సంవత్సరాలు ప్రాక్టీస్‌ చేసిన ఈశ్వర్‌ ప్రసాద్‌.. 1990లో హైకోర్టు బెంచ్‌లో చేరారు.

ఇవి కూడా చదవండి : Breaking: విశాఖలో విషాదం.. కుప్పకూలిన ఫ్లైఓవర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు..

Auto-Rickshaw Race: చెన్నై రోడ్లపై ఆటో రేస్.. హడలిపోయిన ప్రయాణికులు.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్..