CDAC Recruitment: హైదరాబాద్ సీ-డ్యాక్‌లో ఉద్యోగాలు.. కంప్యూటర్ సైన్స్ చేసిన వారు అర్హులు..
CDAC Recruitment 2021: భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది...
CDAC Recruitment 2021: భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఖాళీలను హైదరాబాద్‌లోని ఈ సంస్థలో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 13 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు అప్లై చేసుకునే వారు కనీసం 60% మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్)/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 37 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* అభ్యర్థులను రాత పరీక్ష/ఇతర టెస్ట్‌ల ఆధారంగా ఎంపిక చేస్తారు. * దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీగా 26-06-2021ని నిర్ణయించారు. * పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..