IREL Recruitment: ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే.. రేపే చివ‌రి తేదీ..

IREL Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ అణుశ‌క్తి విభాగానికి చెందిన ఇండియ‌న్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (ఐఆర్ఈఎల్‌) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 08 ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

IREL Recruitment: ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే.. రేపే చివ‌రి తేదీ..
Irel
Narender Vaitla

|

Jun 20, 2021 | 6:20 AM

IREL Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ అణుశ‌క్తి విభాగానికి చెందిన ఇండియ‌న్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (ఐఆర్ఈఎల్‌) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 08 ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఎవ‌రు అర్హులు, ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివ‌రాలు..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌తలు..

* మొత్తం 08 పోస్టుల‌కు గాను.. చీఫ్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్‌ (టెక్నికల్‌)– 02, మేనేజర్‌(లీగల్‌)–01, మేనేజర్‌ (సెక్యూరిటీ)–03, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌ఎం)–02 భ‌ర్తీ చేయ‌నున్నారు.

* చీఫ్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్‌(టెక్నికల్‌) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* మేనేజర్‌(లీగల్‌) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. లా గ్రాడ్యుయేషన్‌ (మూడు సంవత్సరాలు)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* మేనేజర్‌(సెక్యూరిటీ) పోస్టుల‌కు అప్లై చేసుకోవాల‌నుకునే వారు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు ఇండియన్‌ ఆర్మీలో కెప్టెన్‌ హోదాకు తగ్గకుండా/తత్సమాన ర్యాంకుతో పనిచేసి ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ద‌ర‌ఖాస్తును డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(పర్సనల్‌), ఐఆర్‌ఈఎల్‌(ఇండియా) లిమిటెడ్, వీర్‌ సావర్కర్‌ మార్గ్, ప్రభాదేవి, ముంబై–400028 అడ్ర‌స్‌కు పంపించాలి. * అభ్య‌ర్థుల‌ను ఇంటర్వూ/సైకోమెట్రిక్‌ టెస్ట్‌/గ్రూప్‌ ఎక్స్‌ర్‌సైజ్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ద‌ర‌ఖాస్తుల‌కు స్వీక‌ర‌ణ రేప‌టితో (21-06-2021) ముగియ‌నుంది. * పూర్తి వివ‌రాల‌కు https://www.irel.co.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Also Read: Guidelines for Parents: త్వరలో తెరుచుకోనున్న స్కూళ్లు.. పిల్లలను ఇలా సిద్ధం చేయండి.. కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు

TS POLYCET 2021: తెలంగాణ పాలిసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎలాంటి రుసుము లేకుండా మరో అవకాశం.. పూర్తి వివరాలివే

APPSC: హైకోర్టు జోక్యంతో నిలిచిపోయిన గ్రూప్ 1 ఇంటర్వ్యూలు..అయోమయం..ఏపీపీఎస్సీ పరీక్షల తీరు..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu