AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guidelines for Parents: త్వరలో తెరుచుకోనున్న స్కూళ్లు.. పిల్లలను ఇలా సిద్ధం చేయండి.. కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు

పాఠశాల మూసివేతతోొ విద్యార్థులు తమ ఇళ్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పిల్లలకు సహాయం చేయడానికి వారి తల్లిదండ్రులకు విద్యా మంత్రిత్వ శాఖ కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది.

Guidelines for Parents: త్వరలో తెరుచుకోనున్న స్కూళ్లు.. పిల్లలను ఇలా సిద్ధం చేయండి.. కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు
Education Ministry Issues Guidelines For Parents
Balaraju Goud
|

Updated on: Jun 19, 2021 | 4:46 PM

Share

Education Ministry Issues Guidelines For Parents: కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నారు. సగటు మనిషిని ఆర్థికంగా మానసికంగా కృంగదీసింది. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తుపై కూడా గట్టి దెబ్బే కొడుతోంది. ఏడాదిన్నర కాలంగా విద్యాసంస్థలు సరిగా నడవకపోవడంతో వారు ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. పాఠశాల మూసివేత సమయంలో ఎక్కువ కాలం విద్యార్థులు తమ ఇళ్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పిల్లలకు సహాయం చేయడానికి వారి తల్లిదండ్రులకు విద్యా మంత్రిత్వ శాఖ కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది.

తాత్కాలికంగా చదువుకు దూరమైన చిన్నారులను.. చురుగ్గా ఉంచేందుకు కేంద్ర విద్యాశాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇళ్లే మొదటి పాఠశాలంటూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్రను గుర్తుచేసింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్ నిశాంక్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఇల్లే మొదటి పాఠశాలని, తల్లిదండ్రులే మొదటి గురువులని నేను దృఢంగా భావిస్తాను. ఈ మహమ్మారి వేళ.. పిల్లల ఎదుగుదలలో, నేర్చుకోవడంలో వారిదే కీలక పాత్ర’ అని రమేశ్‌ పొఖ్రియాల్ నిశాంక్ పేర్కొన్నారు.

అమ్మానాన్నలు పిల్లలకు ఏవిధంగా సహకరించగలరో మార్గదర్శకాల్లో విద్యాశాఖ వివరించింది. మూడు సంవత్సరాల వయస్సు నుంచి విద్యార్థి ప్రతిదశలో ఎదుగుదలకు దోహదం చేసే సమాచారాన్ని పొందుపరచింది. అంతగా చదువుకోని తల్లిదండ్రులు, ప్రత్యేక అవసరాలున్న చిన్నారులు, ఒత్తిడిలో ఉన్న పిల్లలకోసం ప్రత్యేక వివరణ ఇచ్చింది. పది చాప్టర్లుగా విడుదల చేసిన మార్గదర్శకాలను విద్యాశాఖ వెబ్‌సైట్‌(www.education.gov.in)లో వీక్షించవచ్చు.

తల్లిదండ్రులకు మార్గదర్శకాలుః

* పిల్లలకు ఒక టైం టేబుల్ సిద్ధం చేయాలి. అవి సరళంగా ఉండేలా చూడాలి.

* పిల్లలతో ఎప్పటికప్పుడు మాట్లాడి.. వారు చదువుకోవడానికి, ఆటలకు, ఇతర కార్యక్రమాలకు సమయాన్ని నిర్ణయించండి.

* చిన్నారులతో సన్నిహితంగా మెలగడంతో పాటు, వారి ఎదుట సానుకూల మాటలు, సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోండి.

* మీరు ఏం చేస్తారో.. పిల్లలు దాన్నే అనుసరిస్తారని గుర్తుంచుకోండి.

* పిల్లలతో సరదాగా గడపడంతో పాటు, మంచి సంబంధాల్ని ఏర్పరచుకోండి.

* పిల్లలకు ఇష్టమైన పాఠ్యాంశం గురించి అడిగి తెలుసుకోండి. అందులోనే మంచి తర్పీదు ఇప్పించండి.

* కథలు చెప్పడం, పాటలు పాడటం, మెదడుకు పనిపెట్టే ఆటలు ఆడించడం.. చేయండి.

* వారి శారీరక వికాసం కోసం యోగా, వ్యాయామాలపై దృష్టి పెట్టండి.

* పాఠశాలలకు వెళ్లేందుకు వారిని మానసికంగా సిద్ధంగా ఉంచండి.

* త్వరలో పాఠశాలలు తెరుస్తారనే భరోసాను ఇవ్వండి.

* స్కూళ్లకు వెళ్లాక తీసుకోవాల్సిన జాగ్రత్తలను ముందుగానే చెప్పి, సిద్ధం చేయండి.

Read Also…  Telangana School Reopening: జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. తెలంగాణ స‌ర్కార్ నిర్ణ‌యం