NID Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. అర్హులెవరు.? ఎలా అప్లై చేసుకోవాలి.
NID Haryana Recruitment 2021: ఏనేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) పలు విభాగాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హర్యానా రాష్ట్రంలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ ప్రమోషన్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) విభాగానికి..
NID Haryana Recruitment 2021: ఏనేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) పలు విభాగాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హర్యానా రాష్ట్రంలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ ప్రమోషన్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) విభాగానికి చెందిన ఈ సంస్థలో మొత్తం 27 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* 27 ఖాళీల్లో భాగంగా.. సీనియర్ సూపరింటెండెంట్ (02), అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (04), సీనియర్ అసిస్టెంట్ లైబ్రేరియన్ (01), సూపరింటెండెంట్ (03), డిజైన్ ఇన్‌స్ట్రక్టర్ (02), టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్ (0)2, సీనియర్ అసిస్టెంట్ (04), సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్ (01), సూపర్‌వైజర్ (01), టెక్నికల్ అసిస్టెంట్ (02), అసిస్టెంట్ (05) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* సీనియర్ సూపరింటెండెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు. కామర్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. * అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకునే వారు బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులవ్వాలి. * సీనియర్ అసిస్టెంట్ లైబ్రేరియన్ దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్ డిగ్రీ (లైబ్రరీ సైన్స్/ఇన్ఫర్మేషన్‌సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి. * సూపరింటెండెంట్ పోస్టులకు అప్లై చేసుకునే వారు బ్యాచిలర్ డిగ్రీలో పాసై ఉండాలి. * డిజైన్ ఇన్‌స్ట్రక్టర్ ఖాళీలకు అప్లై చేసుకునే వారు డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు మూడేళ్ల అనుభవం తప్పనిసరి. * టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి. * సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. * సూపర్‌వైజర్‌కు పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణతను అర్హతగా నిర్ణయించారు. * టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. * అసిస్టెంట్ పోస్టుకు అప్లై చేసుకునే వారు బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అభ్యర్థులను ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు.. అనంతరం వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తును.. చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, హర్యానా, ట్రాన్సిట్ క్యాంప్ ఎట్ పాలిటెక్నిక్ బిల్డింగ్, ఉమ్రీ గ్రామం, జిల్లా–కురుక్షేత్ర–136131 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 19.07.2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: APPSC: హైకోర్టు జోక్యంతో నిలిచిపోయిన గ్రూప్ 1 ఇంటర్వ్యూలు..అయోమయం..ఏపీపీఎస్సీ పరీక్షల తీరు..!