IKEA Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఐకియా స్టోర్‌లో భారీగా ఉద్యోగాలు..!
IKEA Jobs: దేశంలోనే అతిపెద్ద స్టోర్‌ను ఐకియా బెంగళూరులో ఏర్పాటు చేసింది. ఈ స్టోర్ 4,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దేశంలో తన ఫుట్‌ప్రింట్‌ను..
IKEA Jobs: దేశంలోనే అతిపెద్ద స్టోర్‌ను ఐకియా బెంగళూరులో ఏర్పాటు చేసింది. ఈ స్టోర్ 4,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దేశంలో తన ఫుట్‌ప్రింట్‌ను పెంచుకునేందుకు త్వరలోనే ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రకటన చేసింది. దీంతో 72 శాతం స్థానిక ఉద్యోగులతో వెయ్యి మందిని నియమించుంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. అన్ని కేటగిరిలో ఉద్యోగులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.
ఏయే ఉద్యోగాలను భర్తీ చేస్తోంది..
☛ సప్లై ప్లానర్, టెక్స్‌టైల్ కార్పెట్స్
☛ సప్లై ప్లానర్- టెక్స్‌టైల్ ఉత్పత్తులు
☛ సప్లై ప్లానర్, కేటగిరి ఏరియా-మెటల్, ప్లాస్టిక్ ప్లాట్ గ్లాస్, ఎలక్ట్రానిక్స్
☛ ప్రాజెక్టు లీడర్
☛ ఉత్పత్తుల పరిశీలకులు
☛ మల్టీఛానల్ నెట్‌వర్క్ ప్రాజెక్టు మేనేజర్
☛ సీనియర్ సైబర్ ఇంజనీర్
☛ సైబర్ ఇంజనీర్
☛ సర్వీస్ ఫిల్‌మెంట్ ఆపరేషన్స్ డెవలపర్
☛ సేల్స్ కో-వర్కర్
☛ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
☛ సర్వీస్ బిజినెస్ సెటిల్మెంట్ జూనియర్ స్పెషలిస్ట్
☛ గూడ్స్ ఫ్లో టీమ్ లీడర్ – VR మాల్
☛ SSS టీమ్-లీడర్ – VR మాల్
అయితే స్టోర్ ఏర్పాటు చేసిన తర్వాత క్రమంగా రద్దీ పెరిగిపోయింది. దీంతో కస్టమర్లు సుమారు మూడు గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి రావడంతో సెక్యూరిటీ గార్డులకు రద్దీని అదుపు చేయడం కష్టంగా మారింది. బెంగళూరులో రూ.3వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఐకియా సీఈవో తెలిపారు. నాగసంద్రస్టోర్ దేశంలో నాలుగో ఐకియా స్టోర్. ఇంటి అవసరాలకు కావాల్సిన పలు రకాల ఫర్నిచర్, ఇతర వస్తువులపై ఆఫర్ చేస్తోంది. ఈ ఏడాదిలో ఐదు మిలియన్ల మంది వినియోగదారులు స్టోర్‌ను సందర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా నాలుగు సైట్‌లతో కలిగి ఉంది ఐకియా. 2018లో తన మొదటి స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఇక 2020, 21లో వరుసగా నవీ ముంబైలలో స్టోర్‌లను ప్రారంభించింది. జూన్ 22న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఐకియా స్టోర్‌ను ప్రారంభించారు. వేలాది హోమ్ ఫర్నింగ్ ప్రొడక్టులు ఈ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోర్‌లోనే వెయ్యి కుర్చీల రెస్టారెంట్‌ను ఆఫర్ చేస్తుంది.
మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి