Facebook Package: ఏం టాలెంట్ గురూ.. ఫైనల్ ఇయర్‌లోనే రూ. కోట్ల జీతం.. పేదరికాన్ని వెనక్కి నెట్టి..
Facebook Package: పేదరికం ప్రతిభకు అడ్డుకాదని చాటి చెప్పాడు ఓ యువకుడు. ప్రతికూల పరిస్థితులు ఏవైనా విజయాన్ని అడ్డుకోలేవని నిరూపించాడు. నిరుపేద కుటుంబంలో జన్మించినా...
Facebook Package: పేదరికం ప్రతిభకు అడ్డుకాదని చాటి చెప్పాడు ఓ యువకుడు. ప్రతికూల పరిస్థితులు ఏవైనా విజయాన్ని అడ్డుకోలేవని నిరూపించాడు. నిరుపేద కుటుంబంలో జన్మించినా తన టాలెంట్‌తో ఏకంగా ఏడాదికి రూ. 1.8 కోట్ల వార్షిక జీతంతో ఉద్యోగం సాధించాడు. వివరాల్లోకి వెళితే వెస్ట్ బెంగాల్ బీర్బూమ్ జిల్లాలోని రామ్‌పూర్‌హాట్ అనే గ్రామానికి చెందిన బిసాఖ్ మొండల్ అనే కుర్రాడు కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
ఇటీవల క్యాంపస్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో బిసాఖ్‌కు ఫేస్‌బుక్‌లో ఉద్యోగం లభించింది. బిసాఖ్ ప్రతిభకు ఫిదా అయిన ఫేస్‌బుక్ యాజమాన్యం ఏకంగా రూ. 1.8 కోట్ల వార్షిక వేతనంతో అతన్ని నియమించుకుంది. ఇలా ఇంకా డిగ్రీ కూడా పూర్తి కాకుండానే బిసాక్ కోట్ల ప్యాకేజ్‌తో ఉద్యోగం సాధించాడు. బిసాఖ్ సెప్టెంబర్‌లో లండన్‌లోని ఫేస్‌బుక్ ఆఫీస్‌లో ఉద్యోగంలో చేరనున్నాడు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ..’సెప్టెంబర్‌లో ఫేస్‌బుక్‌లో విధుల్లో చేరనున్నాను. ఈ ఆఫర్‌కంటే ముందు నాకు గూగుల్, అమెజాన్‌లో కూడా ఆఫర్ వచ్చింది. అయితే ఫేస్‌బుక్ ఎక్కువ ప్యాకేజ్ ఆఫర్ చేసిన కారణంగా దానికి ఓకే చెప్పాను. నా పేరెంట్స్, ప్రొఫెసర్ చాలా సంతోషంగా ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు.
ఇక బిసాఖ్ కుటుంబ నేపథ్యం విషయానికొస్తే వారిది ఒక పేద కుటుంబం. బిసాఖ్ తండ్రి ఒక రైతు, తల్లి అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది. అయితే చిన్ననాటి నుంచి చదువు మీద ఆసక్తి ఉన్న బిసాక్ కష్టపడి చదివి ఈ రోజు ఫేస్‌బుక్ లాంటి కంపెనీలు ఉద్యోగం సాధించాడు. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో గతంలోనూ చాలా మంది అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగాలు దక్కించుకొని వార్తల్లో నిలిచారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..