AIIMS Recruitment: ఎయిమ్స్‌లో టీచింగ్ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

AIIMS Recruitment: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది...

AIIMS Recruitment: ఎయిమ్స్‌లో టీచింగ్ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Aiims Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 27, 2022 | 11:38 AM

AIIMS Recruitment: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌ కళ్యాణి ఎయిమ్స్‌లో ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 89 ఖాళీనలు భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రొఫెసర్లు (25), అడిషనల్‌ ప్రొఫెసర్లు (19), అసోసియేట్‌ ప్రొఫెసర్లు (19), అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు (26) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* అనెస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, నెఫ్రాలజీ, రేడియాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, పల్మనరీ మెడిసిన్‌, ఫార్మకాలజీ, పాథాలజీ, ఆప్తల్మాలజీ, పీడియాటిక్‌ సర్జరీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు టీచింగ్‌లో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్మమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.? అనంతరం ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ఎన్‌హెచ్‌-34 కనెక్టర్‌ బసంతపూర్‌, కళ్యాణి, వెస్ట్‌ బెంగాల్‌ అడ్రస్‌కు పంపించాలి.

* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత 15 రోజుల్లో హార్డ్‌ కాపీలను పంపించాల్సి ఉంటుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..