AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agnipath Scheme: అగ్నిపథ్‌పై యువత ఆసక్తి.. కేవలం మూడు రోజుల్లోనే అర లక్ష దాటిన దరఖాస్తులు..

Indian Air Force Recruitment: ఇండియన్‌ ఆర్మీ నియామకాల్లో సరికొత్త విధానాన్ని తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం 'అగ్నిపథ్‌' అనే పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంపై..

Agnipath Scheme: అగ్నిపథ్‌పై యువత ఆసక్తి.. కేవలం మూడు రోజుల్లోనే అర లక్ష దాటిన దరఖాస్తులు..
Narender Vaitla
|

Updated on: Jun 27, 2022 | 12:08 PM

Share

Indian Air Force Recruitment: ఇండియన్‌ ఆర్మీ నియామకాల్లో సరికొత్త విధానాన్ని తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్‌’ అనే పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ కొత్త విధానం ద్వారా తమకు అన్యాయం జరుగుతుందని కొందరు నిరసనలకు దిగారు. దేశ వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారుల నిరసనల్లో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది.

అయితే అగ్నిపథ్‌ పథకం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని దేశ భద్రత, యువకుల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని కేంద్ర చెబుతోంది. ఈ నేపథ్యంలో నిరసనలను తగ్గించేందుకు పథకంలో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. ఇదిలా ఉంటే ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా అగ్నిపథ్‌ విషయంలో కేంద్ర వెనకడగుడు వేయలేదు. ఆర్మీ నియామకాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌లను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే జూన్‌ 24న ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో అగ్నివీర్‌లను తీసుకోవడానికి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

జూన్‌ 24న ప్రారంభమైన ఈ దరఖాస్తుల ప్రక్రియ జూలై 5తో ముగియనుంది. ఇదిలా ఉంటే ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ నోటిఫికేషన్‌కు యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. నోటిఫికేషన్‌ మొదలైన కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 56,960 మంది అప్లై చేసుకోవడం విశేషం. గడువుకు ఇంకా 8 రోజులు ఉన్న నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో https://agnipathvayu.cdac.in/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అగ్నివీర్ ఎంపిక పరీక్ష జూలై 24 న ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

అర్హతలు, ఎలా ఎంపిక చేస్తారు.

* ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అగ్నివీర్‌ల పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియట్/10+2, లేదా 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా ఫైనల్ ఇయర్ మార్క్ షీట్ కలిగిన వారు కూడా అర్హులు.

* అభ్యర్థుల వయసు 17.5 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

* అభ్యర్థులను రెండు దశల ద్వారా నియమించుకుంటారు. ఫేస్‌-1లో ఆన్‌లైన్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన వారిని షార్ట్‌లిస్ట్‌ చేసి ఫేస్‌-2 పరీక్షను నిర్వహిస్తారు. చివరిగా డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, వైద్య పరీక్షల అనంతరం అగ్నివీర్‌లుగా నియమిస్తారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..