BEML Recruitment 2022: భారత్‌ ఎర్త్‌ మూవర్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు.. ఈ అర్హతలు తప్పనిసరి..

భారత ప్రభుత్వ డిఫెన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎర్త్‌ మూవర్స్ లిమిటెడ్‌.. 80 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

BEML Recruitment 2022: భారత్‌ ఎర్త్‌ మూవర్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు.. ఈ అర్హతలు తప్పనిసరి..
BEML Limited Apprentice Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 16, 2022 | 7:49 AM

భారత ప్రభుత్వ డిఫెన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎర్త్‌ మూవర్స్ లిమిటెడ్‌.. 80 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌, సివిలి ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అప్రెంటిస్‌ రూల్స్ ప్రకారం వయోపరిమితి ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో నవంబర్ 21, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించవచ్చు. ఎంపిక విధానం, స్టైపెండ్ నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్:

AGM (Training), BEML Limited, Bangalore Complex, New Thippasandra post, Bangalore-560075.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.