Bank Of Baroda Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

Bank Of baroda Recruitment 2021: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని బ్రాంచీలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా కాంట్రాక్ట్ విధానంలో పలు విభాగాల్లో పోస్టులను...

Bank Of Baroda Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Bank Of Baroda Jobs
Follow us

|

Updated on: Jul 01, 2021 | 9:50 PM

Bank Of Baroda Recruitment 2021: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని బ్రాంచీలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా కాంట్రాక్ట్ విధానంలో పలు విభాగాల్లో పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* ఇందులో భాగంగా హెడ్‌, డిప్యూటీ హెడ్‌, ప్రెసిడెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. * బిజినెస్‌ ఫైనాన్స్‌, ఇంటర్నల్‌ కంట్రోల్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ గవర్నెన్స్, ఇన్వస్టర్‌ రిలేషన్స్, ఫైనాన్షియల్‌ అకౌంటింగ్, బ్యాలెన్స్‌ షీట్‌ ప్లానింగ్‌ వంటి విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తుచేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి.. గ్రాడ్యుయేషన్‌తోపాటు ఎంబీఏ(ఫైనాన్స్‌) /సీఎఎఫ్‌ఏ/సీఎంఏ/సీఏ ఉత్తీర్ణులవ్వాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా తప్పనిసరి. * అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 32 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. * దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 15.07.2021ని నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: BSF Recruitment 2021: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. రూ. 90 వేలకు పైగా జీతం పొందే అవకాశం..

TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్‌ అభ్యర్థులకు మరో అవకాశం.. దరఖాస్తుల గడువు పెంచుతూ నిర్ణయం..

Indian Coast Guard: ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి.