Basara IIIT: బాసర ట్రిపుల్‌ఐటీలో హామీల అమలు దిశగా అడుగులు.. యుద్ధప్రాతిపదికన పనులు మొదలు పెట్టిన అధికారులు..
Basara IIIT: విద్యార్థుల నిరసనలతో దద్దరిల్లిన బాసర ట్రిపుల్ ఐటీలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీతో క్యాంపస్‌లో...
Basara IIIT: విద్యార్థుల నిరసనలతో దద్దరిల్లిన బాసర ట్రిపుల్ ఐటీలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీతో క్యాంపస్‌లో మౌలిక వసతుల కల్పన పనులు జరుగుతున్నాయి. వారంలో రెండు రోజులు బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కి వస్తోన్న జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖి… అక్కడ జరుగుతోన్న పనులను నేరుగా సమీక్షిస్తున్నారు. అయితే, మొత్తం 12 డిమాండ్లలో ప్రస్తుతం రెండింటే అమలు జరుగుతున్నాయని అంటున్నారు.
మౌలిక వసతుల కల్పనను ప్రాధాన్యత ఇస్తూ, లైబ్రరీ అండ్ ల్యాబ్స్ పనులు చేస్తున్నారు. రూ. 3 లక్షలతో లైబ్రరీ హాల్‌ని సిద్ధం చేస్తున్నారు. అయితే, పూర్తిస్థాయిలో లైబ్రరీని సిద్ధం చేయాలంటే కోటి రూపాయలు అవసరమే మాట వినిపిస్తోంది. ఇక, క్యాంటీన్, హాల్స్, బాత్రూమ్స్, క్లాస్ రూమ్స్, హాస్టల్స్‌లో సౌకర్యాల కల్పనకు 5కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పినా, ఇంకా విడుదల కాలేదంటున్నారు. వీసీ నియామకం కూడా ఆలస్యమయ్యే ఛాన్సే కనిపిస్తోంది. పర్మినెంట్ వీసీ అపాయింట్‌మెంట్ కోసం కమిటీ ఫామ్ చేయాల్సి ఉండటంతో 3నెలలు పట్టే అవకాశం ఉందంటున్నారు.
అయితే, ఈ నెలాఖరులోగా 110మంది ఫ్యాకల్టీని కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక, స్టూడెంట్స్ డిమాండ్స్‌లో ఒకటైన ల్యాప్‌టాప్స్ కొనుగోలుకు నోటిఫికేషన్ రిలీజైంది. అయితే, 16వందల ల్యాప్‌టాప్స్ రావడానికి నెలరోజులు పడుతుందని చెబుతున్నారు. మొత్తానికి, కొంచెం ఆలస్యమైనా మొత్తం డిమాండ్లను నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..