Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ను ఇలా చెక్‌ చేసుకోండి..

TS Inter Results 2022: లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. గతంలో పలుసార్లు వాయిదా పడుతూ వచ్చినజజ

TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ను ఇలా చెక్‌ చేసుకోండి..
AP Inter Results
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jun 28, 2022 | 11:31 AM

TS Inter Results 2022: లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. గతంలో పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకెండ్‌ ఇయర్‌ రిజల్ట్స్‌ను ఇంటర్‌ బోర్డు నేడు (జూన్‌28) ప్రకటించింది.

కాగా చాలా రోజులుగా తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగిన సంగతి తెలిసిందే. రిజల్ట్స్‌ విషయంలో ఈరోజు, రేపు ప్రచారం సాగింది. దీనికి తోడు బోర్డు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంతో ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయో తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.అయితే ఈ విషయంపై ఎట్టకేలకు ఆదివారం సాయంత్రం ఇంటర్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన విడుదలవడంతో తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటనలో పేర్కొంది ఇంటర్ బోర్డ్.

ఇదిలా ఉంటే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలు హాజరయ్యారు. వీరిలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌తో పాటు వొకేషనల్‌ విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది మే 6 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1443 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.ఫలితాలు విడుదలువుతోన్న నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడికి గురైనా, ఇతర సమ‌స్యల పరి‌ష్కా‌రా‌నికి టోల్‌ఫ్రీ నం.18005999333ను సంప్రదించ‌వ‌చ్చని అధికారులు చెబుతున్నారు. ఇంటర్‌ రెండు ఏడాదుల ఫలితాలు ఒకేసారి విడుదలకానున్నాయి. అలాగే పదో తరగతి పరీక్ష ఫలితాలను ఈనెల 30న లేదా జూలై 1వ తేదీన విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి