Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల.. ఫలితాలను టీవీ9 వెబ్‌సైట్‌లో సింపుల్‌గా చెక్‌ చేసుకోండి..

Narender Vaitla

|

Updated on: Jun 28, 2022 | 1:48 PM

TS Inter Results: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు..

Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల.. ఫలితాలను టీవీ9 వెబ్‌సైట్‌లో సింపుల్‌గా చెక్‌ చేసుకోండి..
TS Inter Results

TS Inter 1st, 2nd Year Results: తెలంగాణలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. గతకొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోన్న ఫలితాలను మంగళవారం తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో మొత్తం 294378 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో 63.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అమ్మాయిలు 72.3 శాతం కాగా, అబ్బాయిలు 54.24 శాతం మంది పాస్ అయ్యారు.

సెకండ్ ఇయర్ విషయానికొస్తే…మొత్తం 67.96 శాతం ఉత్తీర్ణత సాధించగా వీరిలో అమ్మాయిలు 75.28 శాతంగా ఉండగా, 59.21 శాతం అబ్బాయిలు పాస్‌ అయ్యారు. సెకండ్‌ ఇయర్‌లో 78 శాతంతో మేడ్చల్‌ మొదటి స్థానంలో ఉండగా, 47 శాతంతో మెదక్‌ చివరి స్థానంలో ఉంది. ఇక ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి..

ఈ నెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ తో పాటు టీవీ9 తెలుగు వెబ్ సైట్ tv9telugu.com లో కూడా విద్యార్థులు చూసుకోవచ్చు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Jun 2022 12:55 PM (IST)

    సాయంత్రం నుంచి మార్కుల మెమోలు..

    ఇంటర్‌ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో బోర్డ్‌ ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి మార్కుల మెమోను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆన్‌లైన్‌లో పొందిన వాటితో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఒరిజినల్‌ మెమోలు త్వరలోనే ఆయా కాలేజీలకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు షార్ట్‌ మెమో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

    ఇంటర్ రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి..

  • 28 Jun 2022 11:30 AM (IST)

    ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి..

  • 28 Jun 2022 11:26 AM (IST)

    జిల్లాల వారీగా ఫలితాలు ఇలా ఉన్నాయి..

    ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 76 శాతంతో అత్యధికంగా మేడ్చల్ మొదటి స్థానంలో నిలవగా 40 శాతంతో మెదక్‌ చివరి స్థానంలో ఉంది. ఫస్ట్‌ ఇయర్‌లో అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 72.33కాగా, అబ్బాయిల పాస్ పర్సంటేజ్‌ 54.25 శాతంగా ఉంది. ఇక సెకండ్‌ ఇయర్‌లో మొత్తం ఉత్తీర్ణత శాతం 75.28కాగా వీరిలో అమ్మాయిలు 75.28 శాతంగా ఉండగా, 59.21 శాతం అబ్బాయిలు పాస్‌ అయ్యారు. సెకండ్‌ ఇయర్‌లో 78 శాతంతో మేడ్చల్‌ మొదటి స్థానంలో ఉండగా, 47 శాతంతో మెదక్‌ చివరి స్థానంలో ఉంది.

  • 28 Jun 2022 11:20 AM (IST)

    పాస్‌ పర్సంటేజ్‌ ఎంతంటే..

    తెలంగాణ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షల్లో మొత్తం 63.32 మంది ఉత్తీర్ణత సాధించారు. సెంకడ్‌ ఇయర్‌లో 67.16 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రెండు ఏడాదుల్లోనూ బాలికలదే పైచేయి ఉంది.

  • 28 Jun 2022 11:13 AM (IST)

    ఏ జిల్లాలో ఎంత మంది పాస్ అయ్యారంటే..

    Inter

     

  • 28 Jun 2022 11:02 AM (IST)

    ఫలితాల్లో వీటి ఫుల్‌ ఫామ్స్‌ తెలుసా.?

    A- ఆబ్సెంట్‌ F- ఫెయిల్‌ P- పాస్‌ F*- సప్లీమెంటరీ ఫెయిల్‌ M- మాల్‌ప్రాక్టిస్‌ N- నాన్‌-రిజిస్టర్డ్‌ COMP- కంపార్ట్‌మెంటల్‌ P*- సప్లిమెంటరీ పాస్‌ W- విత్‌హెల్డ్‌

  • 28 Jun 2022 10:51 AM (IST)

    గతేడాది అందరూ పాస్‌..

    గతేడాది ఇంటర్ బోర్డ్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఫెయిల్‌ కావడంతో ఫలితాలతో సంబంధం లేకుండా అందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గతేడాది తెలంగాణలో మొత్తం 4,51,585 విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించారు.

  • 28 Jun 2022 10:48 AM (IST)

    గ్రేడ్స్‌ ఎలా ఇస్తారంటే..

    * 75 శాతం కంటే ఎక్కువ మార్కులు వస్తే A గ్రేడ్‌ * 60 నుంచి 75 శాతం మార్కులు వస్తే B గ్రేడ్‌ * 50 నుంచి 60 శాతం మార్కులు వస్తే C గ్రేడ్‌ * 35 నుంచి 50 శాతం మార్కులు వస్తే D గ్రేడ్‌

  • 28 Jun 2022 10:21 AM (IST)

    ఫలితాల కోసం ఎదురు చూస్తోన్న 9 లక్షల మంది..

    మరికాసేపట్లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే పాస్ అవుతూ వచ్చిన స్టూడెంట్స్ తొలిసారి పబ్లిక్ పరీక్షల ఆధారంగా పైతరగతులకు ప్రమోట్ కానున్నారు. ఇంటర్ ఫలితాల కోసం 9 లక్షల మంది విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Published On - Jun 28,2022 10:17 AM

Follow us