TS Inter Results: విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఎంత మంది పాస్ అయ్యారంటే..
TS Inter Results: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఫలితాలు విడుదలయ్యాయి. గతకొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోన్న ఫలితాలను మంగళవారం తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు...
TS Inter Results: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఫలితాలు విడుదలయ్యాయి. గతకొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోన్న ఫలితాలను మంగళవారం తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.
ఫస్ట్ ఇయర్ ఫలితాలు..
ఫస్ట్ ఇయర్ కు మొత్తం 464892 విద్యార్థులు హాజరైతే 294378 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 63.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అమ్మాయిలు 72.3 శాతం కాగా, అబ్బాయిలు 54.24 శాతం మంది పాస్ అయ్యారు.
సెకండ్ ఇయర్ విషయానికొస్తే…
ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో మొత్తం 67.96 శాతం కాగా వీరిలో అమ్మాయిలు 75.28 శాతంగా ఉండగా, 59.21 శాతం అబ్బాయిలు పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్‌లో 78 శాతంతో మేడ్చల్ మొదటి స్థానంలో ఉండగా, 47 శాతంతో మెదక్ చివరి స్థానంలో ఉంది. ఇక ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.
ఈ ఏడాది మొత్తం మొత్తం 9 లక్షల 7 వేల 393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గత నెల మే 6 నుంచి 24 వరకు జరిగిన పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ తో పాటు టీవీ9 తెలుగు వెబ్ సైట్ tv9telugu.com లో కూడా విద్యార్థులు చూసుకోవచ్చు.