Assam Rifles Recruitment 2022: అస్సాం రైఫిల్స్ 1380 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..టెన్త్/ఇంటర్ పాసైతే చాలు..
అస్సాం రైఫిల్స్ ర్యాలీ (Assam Rifles).. హవల్దార్, రైఫిల్‌మ్యాన్, వారెంట్ ఆఫీసర్, నాయబ్ సుబేదార్ వంటి పలు (ట్రేడ్స్‌మెన్) పోస్టు (Trademan posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ..
Assam Rifles Technical and Tradesman Recruitment 2022: అస్సాం రైఫిల్స్ ర్యాలీ (Assam Rifles).. హవల్దార్, రైఫిల్‌మ్యాన్, వారెంట్ ఆఫీసర్, నాయబ్ సుబేదార్ వంటి పలు (ట్రేడ్స్‌మెన్) పోస్టు (Trademan posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 1380
పోస్టుల వివరాలు: టెక్నిక్, ట్రేడ్‌మెన్ పోస్టులు
ఖాళీల వివరాలు:
- బ్రిడ్జి, రోడ్ అసిస్టెంట్ పోస్టులు: 17
- క్లర్క్ పోస్టులు: 287
- టీచర్ పోస్టులు: 9
- ఆపరేటర్ రేడియో, మెకానిక్ పోస్టులు: 729
- రేడియో మెకానిక్ పోస్టులు: 72
- వెపన్స్ అసిస్టెంట్ పోస్టులు: 48
- ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు: 13
- నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులు: 100
- వెటర్నరీలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు:10
- హెల్పర్ (పారా మెడికల్) పోస్టులు:15
- వాషర్‌మన్ పోస్టులు: 80
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ. 18,000ల నుంచి 29,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టునుబట్టి పదో తరగతి/ఇంటర్/గ్రాడ్యుయేషన్ డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ క్వాలిటీ టెస్ట్, ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు రుసుము:
- జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ.100
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 20, 2022.
అస్సాం రైఫిల్స్ ర్యాలీ నిర్వహించు తేదీ: సెప్టెంబర్, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.