APPSC Group 1: ఏపీ నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్ 1 దరఖాస్తులకు నేడే చివరి తేదీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ - 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయ తెలిసిందే. ఇటీవల వరుసగా ఉద్యోగాల భర్తీ చేపడుతోన్న ఏపీ ప్రభుత్వం గ్రూప్ 1కు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇదిలా ఉంటే గ్రూప్1..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయ తెలిసిందే. ఇటీవల వరుసగా ఉద్యోగాల భర్తీ చేపడుతోన్న ఏపీ ప్రభుత్వం గ్రూప్ 1కు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇదిలా ఉంటే గ్రూప్1 దరఖాస్తుల స్వీకరణ గడువు నవంబర్ 2తో ముగియాల్సి ఉంది. కానీ అభ్యర్థుల కోరిక మేరకు చివరి తేదీని పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 5వ తేదీని దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శనివారం అర్థరాత్రితో అప్లికేషన్స్ గడువు ముగియనున్న నేపథ్యంలో గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 92 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీపీఎస్సీ. పలు విభాగాల్లో ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు పోస్టుల ఆధారంగా 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్ అభ్యర్థులు రూ. 370, ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులు రూ.120లు అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇక అభ్యర్థులను ప్రిలిమ్స్/ మెయిన్స్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ రాత పరీక్ష డిసెంబర్ 18, 2022న, మెయిన్స్ పరీక్షను మార్చి 2023లో నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారం నెలకు రూ. 54,060 నుంచి రూ.1,51,370 వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..