AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Interview Tips: మొదటి సారి ఇంటర్వ్యూకి వెళ్తున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే ఉద్యోగం మీదే..

ఇంటర్వ్యూ అనేది ఉద్యోగ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. ప్రభుత్వ రంగమైనా, ప్రైవేటు సంస్థల్లోనైనా ఉద్యోగాలు సాధించాలంటే ఇంటర్వ్యూ ను ఎదుర్కోక తప్పదు. అందులో గట్టెక్కితేనే ముందడుగు వేస్తాం. అయితే జాబ్..

Interview Tips: మొదటి సారి ఇంటర్వ్యూకి వెళ్తున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే ఉద్యోగం మీదే..
Job Interview (file Photo)
Ganesh Mudavath
|

Updated on: Nov 05, 2022 | 8:39 AM

Share

ఇంటర్వ్యూ అనేది ఉద్యోగ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. ప్రభుత్వ రంగమైనా, ప్రైవేటు సంస్థల్లోనైనా ఉద్యోగాలు సాధించాలంటే ఇంటర్వ్యూ ను ఎదుర్కోక తప్పదు. అందులో గట్టెక్కితేనే ముందడుగు వేస్తాం. అయితే జాబ్ సాధించేందుకు ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రదర్శన చేయడం చాలా అవసరం. ఇంటర్వ్యూలో స్కిల్స్ తో పాటు, వ్యక్తిగతంగానూ ప్రశ్నలు అడుగుతుంటారు. అందుకే ఇంటర్వ్యూలో సరైన డ్రెస్సింగ్ వేసుకోవడం చాలా ముఖ్యం. ఇంటర్వ్యూలో బాగా పర్ఫార్మ్ చేసేందుకు దుస్తుల నుంచి ఫుట్ వేర్ వరకు అన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. సాధారణంగా ఇంటర్వ్యూకు వెళ్లే ముందు వ్యక్తులు కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇది మనలోని విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇంటర్వ్యూలో తప్పులు చేయకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్వ్యూలో ఫ్రొఫెషనల్ గా కనిపించడానికి డ్రెస్సింగ్ స్టైల్ చాలా అవసరం. సూట్ తో పాటు ఫార్మల్ షూస్ వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో వాతావరణంలోని మార్పులను బట్టి ఛేంజెస్ ఉండాలి. వేసవిలో సూట్ కంటే సాధారణ దుస్తులు ధరించడం ఉత్తమం. శీతాకాలంలో ఉన్నితో చేసిన సూట్‌ ను ధరించడం చాలా సౌకర్యవతంగా ఉంటుంది.

ఇంట‌ర్వ్యూలో మంచి ఇంప్రెష‌న్ రావ‌డానికి కొంత మంది పర్ఫ్యూమ్‌ వాడతారు. వాస్తవానికి పర్ఫ్యూమ్ సువాసన చాలా మందికి చికాకు కలిగిస్తుంది. అందువల్ల ఇంటర్వ్యూ కు వెళ్లేటప్పుడు తేలికపాటి పర్ఫ్యూమ్‌ను ట్రై చేయడం ఉత్తమం. కొంతమంది ఇంటర్వ్యూలో ప్రొఫెషనల్ డ్రెస్‌తో పాటు క్యాజువల్ షూస్‌ని వేసుకుంటారు. అలా చేయడం సరికాదని, దుస్తులకు సరిపోయే ప్రొఫెషనల్ షూలను మాత్రమే ధరించాలని ఎక్స్ పర్స్ట్ చెబుతున్నారు. సన్ గ్లాసెస్, ఫేషియల్ పియర్సింగ్‌లు, గడియారాలు ధరిస్తారు. ఇంటర్వ్యూ కోసం క్లాసీ వాచ్, సాధారణ రింగ్ ధరిస్తే చాలు.

ఇంటర్వ్యూ చేయడానికి సంస్థ ఓ సమయాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి సమయానికి సంస్థ వద్దకు చేరుకోవడం కంటే కాస్త ముందుగానే అక్కడికి వెళ్లడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల అనవసరపు ఒత్తిడి తగ్గకుండా ఉుంటుంది. ఇంటర్వ్యూ పూర్తయి బయటకు వచ్చే వరకూ హుందాగా వ్యవహరించాలి. గేట్‌ దగ్గర పలకరించే సెక్యూరిటీ దగ్గర నుంచి ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల వరకూ కనిపించే వారందరితో హుందాగా ప్రవర్తించాలి. ఇంటర్వ్యూలో మాట్లాడే భాష స్పష్టంగా ఉండాలి. ఇంటర్వ్యూ చేసేవారు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోవచ్చు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియకుంటే.. ఆ విషయాన్ని వినయంగా అంగీకరించాలి. నిజాయతీగా ఉండటం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.