AP Model Schools: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఈ రోజే చివరి తేదీ..
AP Model Schools: ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతి విద్యార్థుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 164 పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు....
AP Model Schools: ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతి విద్యార్థుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 164 పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను లాటరీ విధానం ద్వారా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన విషయాలు..
* ఈ పాఠశాలల్లో అప్లై చేసుకునే విద్యార్థులు.. ఓసీ, బీసీ కులాలకు చెందిన వారు 01-09-2009, 31-08-2021 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01-09-2007 31-08-2021 మధ్య జన్మించి ఉండాలి.
* సంబంధిత జిల్లాల్లో విద్యార్థులు ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2019-2020,2020-21 విద్యా సంవత్సరాల్లో చదివి ఉండాలి.
* దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు పూర్తి వివరాల కోసం https://cse.ap.gov.in/DSENEW/ ఈ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
* అనంతరం దరఖాస్తు చేసుకోవడం కోసం క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
* ఫీజు చెల్చించిన వారికి ఒక జనరల్ నెంబర్‌ను కేటాయిస్తారు.
* ఈ జనరల్ నెంబరన్‌ను ఉపయోగించి https://cse.ap.gov.in/DSENEW/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
* అనంతరం లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేస్తారు.